Rashmika Ravi Teja : మాస్ మహారాజ రవితేజతో రష్మిక - పాన్ ఇండియా సినిమా కోసం!
మాస్ మహారాజ రవితేజతో నేషనల్ క్రష్ రష్మిక నటించనున్నారా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)తో నేషనల్ క్రష్ & కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటించనున్నారా? డ్యాన్సుల్లో, నటనలో ఇరగదీసే వీళ్ళిద్దరూ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? వీళ్ళిద్దరి కలయికలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ జోడీ సినిమా చేయడం దాదాపు ఖాయం అయ్యిందని, ఇక అధికారికంగా వెల్లడించడం మాత్రమే తరువాయి అని టాక్.
రవితేజ... గోపీచంద్ మలినేని... డబుల్ హ్యాట్రిక్!
రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్! వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. అవును... 'డాన్ శీను'తో గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత రవితేజతో 'బలుపు', 'క్రాక్' సినిమాలు చేశారు. ముచ్చటగా మూడు విజయాల తర్వాత నాలుగో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'వీర సింహా రెడ్డి' విజయం తర్వాత ఆ సంస్థలో గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో కథానాయికగా రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ఇటీవల ఆమెను సంప్రదించారట. ఇటీవల రష్మికను కలిసిన దర్శకుడు ఆమెకు కథ చెప్పారని తెలిసింది.
Also Read : నువ్వేం చేయగలవు చెప్పు - 'ఉస్తాద్' దర్శకుడు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్!
ఇప్పటి వరకు రవితేజ, రష్మిక మందన్నా కలిసి సినిమా చేయలేదు. అందువల్ల, వాళ్ళ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. పైగా, రష్మికకు నార్త్ ఇండియాలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ హిందీ సినిమాలు చేశారు. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'లో కూడా ఆమె కథానాయిక. రష్మిక హీరోయిన్ అయితే బాలీవుడ్ మార్కెట్, హిందీ శాటిలైట్ అండ్ ఓటీటీకి కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట.
ఎస్ తమన్ సంగీతంలో...
రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. వాళ్ళ కలయికలో వచ్చిన 'బలుపు', 'క్రాక్'కు ఆయన మ్యూజిక్ ఇచ్చారు. అవి కాకుండా ఇద్దరితో వేర్వేరుగా సినిమాలు కూడా చేశారు.
Also Read : మహేష్, చరణ్ నవ్వులు... అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు ముచ్చట్లు - ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో స్టార్స్
'యానిమల్' డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో సూపర్ డూపర్ పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లో కూడా రష్మిక నటిస్తున్నారు. ధనుష్ 51వ సినిమాలో కూడా ఆమె కథానాయిక. ప్రజెంట్ రష్మిక బిజీ. అయితే... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో రష్మికకు మంచి అనుబంధం ఉంది. 'పుష్ప', 'పుష్ప 2' చిత్రాలు ఆ సంస్థలో తెరకెక్కుతున్నాయి. అందుకని, డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ఓకే అన్నారట.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial