Good Bad Ugly Postponed: సంక్రాంతి రేసు నుంచి తమిళ్ సినిమా అవుట్ - అజిత్ రావడం లేదని కన్ఫర్మ్ చేసిన నిర్మాత
2025 Sankranthi Telugu Movie Releases: సంక్రాంతి 2025 రేసులో అరడజనుకు పైగా సినిమాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే, అందులో నుంచి ఒక సినిమా వాయిదా పడింది. కోలీవుడ్ స్టార్ అజిత్ రావడం లేదు.
![Good Bad Ugly Postponed: సంక్రాంతి రేసు నుంచి తమిళ్ సినిమా అవుట్ - అజిత్ రావడం లేదని కన్ఫర్మ్ చేసిన నిర్మాత Good Bad Ugly out of Sankranthi 2025 race Ajith Kumar producer Naveen Yerneni confirms In Pushpa 2 Chennai Event Good Bad Ugly Postponed: సంక్రాంతి రేసు నుంచి తమిళ్ సినిమా అవుట్ - అజిత్ రావడం లేదని కన్ఫర్మ్ చేసిన నిర్మాత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/24/fcc1d95a57dbe7d62c8aa27c6151c7ab1732467711392313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
థియేటర్లలో సంక్రాంతికి సందడి చేసే సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ డేట్స్ మీద కర్చీఫ్ వేయడం మొదలు పెడుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. మరి కోలీవుడ్ నుంచి? ఒక పెద్ద సినిమా రావడానికి రెడీ అయ్యింది. అయితే, ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకొంది.
సంక్రాంతి రేసు నుంచి అజిత్ అవుట్!?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కలయికలో రూపొందుతున్న సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly). టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా పెద్ద పండక్కి రావడం లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఆ విషయాన్ని స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప 2: ది రూల్' ఈవెంట్ ఈ రోజు చెన్నైలో జరిగింది. అందులో 'గుడ్ బాడ్ అగ్లీ' చిత్రాన్ని వాయిదా వేసిన విషయాన్ని నిర్మాత నవీన్ ఎర్నేని తెలిపారు. ''సినిమా బాగా వచ్చింది మరో ఏడు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది త్వరలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. సంక్రాంతికి మేము వస్తామని ఇంతకు ముందు చెప్పాం. మల్టీపుల్ టైమ్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. కానీ...'' అని చెప్పారు. ఆయన మాటలను బట్టి సినిమా వాయిదా పడిందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 'గుడ్ బాడ్ అగ్లీ' సినిమా చాలా బాగా వచ్చిందని, తమిళ చిత్ర పరిశ్రమలో తమ తొలి అడుగు భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని నవీన్ ఎర్నేని ధీమా వ్యక్తం చేశారు.
So, #GoodBadUgly out of Sankranthi race pic.twitter.com/yw3jAFVldt
— Aakashavaani (@TheAakashavaani) November 24, 2024
సంక్రాంతి బరిలో అజిత్ నటించిన మరొక సినిమా 'విడా మయూర్చి' రానుందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'పుష్ప 2'... రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే... 'పుష్ప 2' మ్యూజిక్ విషయంలో ఇష్యూ తలెత్తిన నేపథ్యంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారడతాడని వార్తలు వినబడుతున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ లేదా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయవచ్చని టాక్.
తెలుగులో ఆ మూడు సినిమాల మధ్య పోటీ!
తెలుగు చిత్ర సీమ నుంచి సంక్రాంతికి మూడు సినిమాలు అయితే విడుదల కావడం గ్యారెంటీ. అందులో మరో సందేహం లేదు. 2025 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న మొదటి సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ చేంజర్'. జనవరి 10న ఆ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఆ తర్వాత జనవరి 12న నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబి కొల్లి రూపొందిస్తున్న 'డాకు మహారాజ్' విడుదల కానుంది. ఆ సినిమా విడుదల జనవరి 12న. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)