Good Bad Ugly OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Good Bad Ugly OTT Platform: తమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ హిట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి రానుంది.

Ajith Kumar's Good Bad Ugly OTT Release On Netflix: కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar), త్రిష (Trisha) జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly). ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా.. ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అజిత్ సరసన త్రిష నటించగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. అర్జున్‌దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. మూవీలో అజిత్ మాస్ యాక్షన్, వింటేజ్ లుక్స్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించాయి.
Also Read: యాంకర్ ప్రదీప్ కొత్త మూవీ నుంచి సుమంత్ 'అనగనగా' వరకూ.. - ఓటీటీలో మేలో వచ్చే సినిమాల లిస్ట్!
స్టోరీ ఏంటంటే?
రెడ్ డ్రాగన్ అలియాస్ ఏకే (అజిత్) పేరు మోసిన గ్యాంగ్ స్టర్. చాలా ఏళ్లుగా చీకటి సామ్రాజ్యానికి డాన్‌గా ఉన్న తర్వాత.. తన భార్య రమ్య (త్రిష) కోరిక మేరకు అన్నింటినీ వదిలేసి ఓ సామాన్య జీవితం గడిపేందుకు సిద్ధమవుతాడు. 17 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత తన కొడుకు విహాన్ (కార్తీక్ దేవ్)ను చూసేందుకు తన భార్యతో కలిసి స్పెయిన్ వెళ్లేందుకు సిద్ధమవుతాడు.
ఈ క్రమంలో ముంబై నుంచి స్పెయిన్ బయలుదేరిన ఏకే ఫ్యామిలీ దగ్గరకు కొందరు గ్యాంగ్‌స్టర్స్ వస్తారు. వాళ్ల దాడి నుంచి త్రుటిలో తప్పించుకుంటాడు అజిత్. ఇదే టైంలో కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలంటే గొడవలన్నీ పూర్తి చేసుకుని రావాలని భార్య చెబుతుంది. మరోవైపు స్పెయిన్‌లో అతని కొడుకును ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసి డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లేలా చేస్తుంది. దీంతో మళ్లీ అతను గ్యాంగ్‌స్టర్‌గా మారాడా?, అసలు అతని కొడుకుని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏకేకు ఆ ముఠాలకు ఉన్న సంబంధం ఏంటి? తన కొడుకును ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఆందోళన కలిగించింది. అయితే.. విడుదలైన అన్నీ ప్రాంతాల్లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. దాదాపు రూ.151 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. ఒక్క తమిళనాడులోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
మరోవైపు.. ఈ మూవీ మేకర్స్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) నోటీసులు పంపించారు. గతంలో తాను కంపోజ్ చేసిన 3 పాటలను తన అనుమతి లేకుండా రీ క్రియేట్ చేశారని నిర్మాతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తాము అన్ని అనుమతులు తీసుకునే ఈ పాటలు ఉపయోగించామని మూవీ టీం చెప్పింది. ఆ తర్వాత ఈ వివాదం సమసిపోయిందో లేదో అనే దానిపై క్లారిటీ లేదు.





















