Godfather vs NBK 107: విజయ దశమికి థియేటర్లలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ? ఆ రెండు సినిమాల మధ్య పోటీ?
విజయ దశమికి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో పోటీ పడబోతున్నారా?
మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ... ఇద్దరూ ఇద్దరే. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ అశేష అభిమాన గణం ఉంది. ఎవరి సినిమా విడుదలైనా.... మన థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. మరి, వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ బరిలో పోటీ పడితే? గతంలో పోటీ పడ్డారు. అయితే, ఒక పది పదిహేను ఏళ్ళుగా పోటీ పడిన సందర్భాలు అరుదు. చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా అందుకు ఒక కారణం.
చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ వందో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఒక్క రోజు వ్యవధిలో విడుదల అయ్యాయి. ఇప్పుడు ఈ దసరాకు కూడా అటువంటి పోటీ ఉండవచ్చని టాక్.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా (NBK107) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను విజయదశమికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాను సైతం విజయ దశమికి విడుదల చేయాలనుకుంటున్నారట. సో... రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ బరిలో పోటీ కన్ఫర్మ్ అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
Also Read: అప్పులు అన్నీ తీరుస్తా, కడుపు నిండా తింటా - కమల్ హాసన్
'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఒక్క సీక్వెన్సు మాత్రమే షూట్ చేయాలని సమాచారం. బాలకృష్ణ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందులో శ్రుతీ హాసన్ హీరోయిన్. చిరంజీవి సినిమాలో నయనతార సోదరి పాత్ర చేస్తున్నారు.
Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట
View this post on Instagram
View this post on Instagram