Godfather Update: చిరంజీవి - సల్మాన్ పాటలో గ్రేస్ మామూలుగా ఉండదు! కొరియోగ్రఫీ ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో ఒక పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు.
డాన్సుల్లో మెగాస్టార్ చిరంజీవికి సపరేట్ స్టైల్ ఉంది. ఆయన డాన్సులో క్లాస్ ఉంటుంది. అలాగే, మాస్ కూడా ఉంటుంది. అన్నిటి కంటే ముఖ్యంగా గ్రేస్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ డ్యాన్సుల్లో కూడా గ్రేస్ ఉంటుంది. ఆయనది కూడా సపరేట్ స్టైల్. సిల్వర్ స్క్రీన్ మీద చిరు, సల్మాన్ కలిసి స్టెప్పేస్తే? ఎలా ఉంటుంది?? వీళ్ళిద్దరి స్టైల్, గ్రేస్ మ్యాచ్ చేసే కొరియోగ్రాఫర్ ఎవరు??? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఆయన ఎవరో కాదు... ఇండియన్ మైకెల్ జాక్సన్, టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా!
చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అంతే కాదు... చిరంజీవి సల్మాన్ మీద ఒక పాట కూడా ఉంటుంది. ఆల్రెడీ ఆ పాటకు అదిరిపోయే ట్యూన్ ఇచ్చానని సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ గతంలోనే చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. రంజాన్ సందర్భంగా ఈరోజు ఆ విషయాన్ని వెల్లడించారు. ఆటం బాంబు లాంటి పాటకు డాన్స్ ఇన్ డైనమైట్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారని గాడ్ఫాదర్ చిత్రబృందం పేర్కొంది.
Also Read: రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఫ్లాప్స్ తప్పవా? అసలు కారణాలు ఏంటి??
కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సోదరిగా నయనతార కనిపించనున్నారు. సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 11న సినిమా విడుదల కానుందని టాక్. ఆల్రెడీ చిరంజీవి ఆ విడుదల తేదీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆగస్టు 11 గురువారం వచ్చింది. ఆగస్టు 15 సోమవారం వచ్చింది. లాంగ్ వీకెండ్ కావడంతో ఆ డేట్ బెస్ట్ అనుకుంటున్నారట.
Also Read: కొరటాల శివకు కండిషన్లు పెట్టిన ఎన్టీఆర్?
View this post on Instagram