News
News
X

God Father First Single : ఆగ్రహంతో మెగా ఫ్యాన్స్ - తమన్‌కు చిరు టెన్షన్?

సంగీత దర్శకుడు తమన్ మీద మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. 'గాడ్ ఫాదర్' టీజర్ నేపథ్య సంగీతం విషయంలో వాళ్ళు సంతోషంగా లేరు. ఈ తరుణంలో ఫస్ట్ సాంగ్ అప్‌డేట్‌ ఇచ్చారు తమన్.

FOLLOW US: 

సంగీత దర్శకుడు తమన్ శివకుమార్ ఘంటసాల (Music Director Thaman) ను చిరు టెన్షన్ వెంటాడుతోందా? అందుకే, ఆయన 'గాడ్ ఫాదర్' (God Father Movie) సినిమా ఫస్ట్ సాంగ్ అప్‌డేట్‌ ఇచ్చారా? అంటే... 'అవును' అనుకోవాలి. ఎందుకంటే... తమన్ మీద మెగా అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడి ఆ విధంగా ఉంది మరి!

మెగాస్టార్ చిరంజీవితో తొలి సినిమా!
'గాడ్ ఫాదర్'తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాకు సంగీతం అందించే అవకాశం తమన్‌కు వచ్చింది. మెగా ఫ్యామిలీలో యువ హీరోలు అందరికీ ఆయన సూపర్ హిట్ సాంగ్స్, నేపథ్య సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'లో 'లా... లా... భీమ్లా...' పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అల్లు అర్జున్ 'అల... వైకుంఠపురములో' సినిమాలో పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోటు వినబడుతూ ఉంటాయి. 'సరైనోడు', 'రేసు గుర్రం' సినిమాలకూ మంచి మ్యూజిక్ అందించారు. అదే విధంగా రామ్ చరణ్ 'బ్రూస్ లీ', 'నాయక్'... వరుణ్ తేజ్ 'తొలి ప్రేమ'తో తమన్ కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. అందువల్ల, 'గాడ్ ఫాదర్'కు సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఆశించారు మెగా ఫ్యాన్స్. 

మెగా అభిమానులను నిరాశ పరిచిన తమన్?
'గాడ్ ఫాదర్' కోసం తమన్ ఎటువంటి సంగీతం అందిస్తారో అని ఎదురు చూసిన మెగా అభిమానులను తమన్ నిరాశ పరిచారా? అంటే... సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తే 'అవును' అనుకోవాలి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల అయిన టీజర్‌లో నేపథ్య సంగీతం మీద విమర్శలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ 'గని' టైటిల్ సాంగ్‌ను తిప్పి కొట్టారని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. టీజర్ విడుదలకు ముందు జరిగిన 'సీసీసీ' కార్యక్రమంలో ''ఇంకా టీజర్ మ్యూజిక్ ఇవ్వలేదు'' అని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ దాన్ని గుర్తు చేస్తున్నారు. తమన్ సినిమాపై సరిగా దృష్టి పెట్టడం లేదని ఫీలవుతున్నారు.

ఫస్ట్ సాంగ్ విడుదలకు తమన్ రెడీ
మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తమన్ గుర్తించారో? లేదంటే వాళ్ళను కూల్ చేయాలని అనుకున్నారో? 'గాడ్ ఫాదర్' ఫస్ట్ సాంగ్ రెడీ అని చెబుతున్నారు. సినిమాలో తొలి పాటను ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఆలపించినట్లు ఆయన తెలిపారు. ఆమెతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు త్వరలో 'గాడ్ ఫాదర్' ఫస్ట్ సాంగ్ వస్తుందని తమన్ పేర్కొన్నారు. ఆ పాట ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార, సత్యదేవ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేశారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న సినిమా విడుదల కానుంది.   

Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?

ట్రోల్స్ కొత్త కాదుగా!
తమన్‌కు ట్రోల్స్ కొత్త కాదు. గతంలోనూ పలు ట్రోల్స్ వచ్చాయి. సంగీత పరమైన నిర్ణయాల వెనుక ఏం జరుగుతుందో ఆయన వివరించారు. తుది నిర్ణయం తనది మాత్రమే ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. 

Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?

View this post on Instagram
 
A post shared by Thaman Shivakumar Ghantasala (@musicthaman)

Published at : 23 Aug 2022 08:02 AM (IST) Tags: chiranjeevi Thaman god father movie God Father First Single Update Trolls On Thaman

సంబంధిత కథనాలు

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం, సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం,  సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam