అన్వేషించండి

రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన 'గదర్ 2' - స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్!

సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం రోజున ఏకంగా రూ.55 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

సన్నీడియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక తాజాగా స్వాతంత్ర దినోత్సవం(ఆగస్టు 15) రోజున రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. ఇండిపెండెన్స్ డే రోజు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాగా 'గదర్ 2' చరిత్ర సృష్టించడం విశేషం. ఆగస్టు 15 మంగళవారం రోజున ఈ సినిమా ఏకంగా రూ.55.5 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ రూ.229 కోట్లకు చేరింది. నిజానికి సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగినా కలెక్షన్స్ విషయంలో మాత్రం దుమ్ము లేపుతోంది.

ఈ సినిమా మొదటిరోజు రూ.40 కోట్లు.. రెండవ రోజు రూ.43 కోట్లు.. మూడో రోజు రూ.51 కోట్లు.. నాలుగో రోజు రూ.38 కోట్లు.. ఐదో రోజు రూ. 55.5 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. సుమారు 20 సంవత్సరాల కింద వచ్చిన 'గదర్' మూవీ కి ఇది సీక్వెల్ గా తెరకెకెక్కింది. 2001లో వచ్చిన 'గదర్' సైతం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటికీ ఆ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో ఇండియా - పాకిస్తాన్ నేపథ్యంలో సాగే సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రేమ కథ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన సీక్వెల్ లో కూడా 1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇక ఈ సినిమాను సరిగ్గా స్వాతంత్ర దినోత్సవం ముందు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, ఆ ప్లాన్ ఇప్పుడు సక్సెస్ అయిందనే చెప్పాలి.

కాగా విడుదలకు ముందే సినిమాలో నటించిన సన్నీ డియోల్, అమీషా పటేల్ దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాని ప్రమోట్ చేశారు. దీంతో ఈ సినిమా అవలీలగా రూ.250 కోట్ల కలెక్షన్స్ మార్క్ అందుకోబోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 'గదర్' సినిమాను డైరెక్ట్ చేసిన అనిల్ శర్మ 'గదర్ 2' ని తెరకెక్కించారు. 'గదర్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఉత్కర్ష శర్మ ఈ మూవీలో మరోసారి నటించాడు. తారా సింగ్(సన్నీ డియోల్) సకీనా(అమీషా పటేల్) కొడుకుగా ఉత్కర్ష్ కనిపించాడు. పాకిస్తాన్ ఆర్మీ బంధించిన తన కొడుకుని విడిపించుకునేందుకు తారాసింగ్ చేసిన యుద్ధం ఆధారంగా ఈ 'గదర్ 2' సినిమాని తెరకెక్కించారు.

మరోవైపు 'గదర్ 2' కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 2023లో అత్యంత వేగంగా భారీ కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలవడంతో పాటు 'పఠాన్', 'కే జి ఎఫ్ 2' రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేసింది. షారుక్ ఖాన్ 'పఠాన్' విడుదలైన నాలుగవ రోజు రూ.26.5 కోట్లు రాబట్టగా.. :కే జి ఎఫ్ 2' హిందీ వర్షన్ రూ.30 కోట్లు వసూలు చేసింది. అయితే 'గదర్ 2' ఏకంగా నాలుగో రోజు రూ.40 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ ని కైవసం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 'గదర్ 2'  నాలుగో రోజు రూ.175 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

Also Read : అమ్మమ్మ తాతయ్యలతో కలిసి జాతీయ జెండా ఎగురవేసిన మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget