Upcoming February Releases : ఫిబ్రవరిలో సినిమాల జాతర - థియేటర్లలోకి 15 సినిమాలు... ఆ రెండూ పోస్ట్ పోన్ అయినట్టేనా ?
Upcoming February Releases : ఫిబ్రవరిలో సినిమాల జాతర షురూ కాంబోతోంది. ఈ నెల థియేటర్లలోకి ఏకంగా 15 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

2025 సంక్రాంతి హాలిడే సీజన్ పూర్తయింది. ఈ పొంగల్ విన్నర్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ నిలిచింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. కానీ ఫిబ్రవరిలో మాత్రం థియేటర్ల దగ్గర సినిమాల జాతర మొదలు కాబోతోంది. పలు పాన్ ఇండియా సినిమాల నుంచి మొదలు పెడితే... మిడ్ రేంజ్ బడ్జెట్, చిన్న సినిమాలు, తెలుగు డబ్బింగ్ సినిమాలు ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్ కు సిద్ధమవుతుంటే, మరికొన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇంకొన్ని సినిమాల రిలీజ్ డేట్లు మారుతున్నాయి. ఫిబ్రవరి 6 తో మొదలు కాబోతున్న ఈ సందడి, ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. మరి ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వాటి రిలీజ్ డేట్లు ఏంటంటే...
డేట్స్ వైజ్ ఫిబ్రవరి అప్ కమింగ్ సినిమాలు
ఫిబ్రవరి 6 - పట్టుదల
ఫిబ్రవరి 7 - తండేల్
ఫిబ్రవరి 7 - భగీరథ
ఫిబ్రవరి 14 - లైలా
ఫిబ్రవరి 14 - కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్
ఫిబ్రవరి 14 - దిల్రూబా
ఫిబ్రవరి 14 - బ్రహ్మానందం
ఫిబ్రవరి 14 - ఇట్స్ కాంప్లికేటెడ్
ఫిబ్రవరి 14 - ఛావా
ఫిబ్రవరి 21 - డ్రాగన్
ఫిబ్రవరి 21 - బాపు
ఫిబ్రవరి 21 - మజాకా
ఫిబ్రవరి 28 - శబ్దం
ఫిబ్రవరి 28 - అఘతీయ
ఫిబ్రవరి 28 - రామం రాఘవం
దిల్రూబా, మజాకా సినిమాలు పోస్ట్ పోన్?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న తర్వాత ప్రేక్షకులను 'దిల్రూబా' అనే మూవీతో పలకరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతున్న సినిమాల సంఖ్య భారీగా ఉండడంతో ఇన్ని సినిమాల మధ్య రిలీజ్ అయితే కనీసం మూవీ రిలీజ్ అయింది అన్న విషయం కూడా చాలామందికి తెలియకుండా పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 14 రేసు నుంచి తప్పుకుని. 'దిల్రూబా'ను ఫిబ్రవరి 21న రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది.
ఇక మరోవైపు సందీప్ కిషన్ 'మజాకా' అనే మూవీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ముందుగా ఫిబ్రవరి 21న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునే ఆలోచనతో 'మజాకా' మూవీని ఫిబ్రవరి 26న రిలీజ్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. కానీ ఈ రెండు సినిమాల కొత్త రిలీజ్ డేట్ల విషయంలో ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇక ప్రస్తుతానికి ఉన్న షెడ్యూల్స్ లో ఇతర సినిమాలేమైనా రిలీజ్ డేట్ లు మార్చుకుంటాయా ? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అందరి దృష్టి నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్'పైనే ఉంది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ గనక బ్లాక్ బస్టర్ హిట్టయితే, ఈ నెలలో రిలీజ్ కానున్న మిగతా సినిమాలు 'తండేల్' సునామీలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. మరి ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న సినిమాలలో హిట్ అన్పించుకునే సినిమాలు ఎన్ని అనేది ఆసక్తికరంగా మారింది.





















