News
News
వీడియోలు ఆటలు
X

'ఖుషి'.. ప్రేమలోని మధుర భావాలకు అద్దం పట్టే 'నా రోజా నువ్వే' సాంగ్ రిలీజ్

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న బ్యూటీఫుల్ లవ్ స్టోరీ 'ఖుషి' మూవీ నుంచి మంచి అప్ డేట్ వచ్చింది. 'నా రోజా నువ్వే' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ కు.. మంచి రెస్పాన్స్ వస్తోంది.

FOLLOW US: 
Share:

Kushi: 'శాకుంతలం' డిజాస్టర్ ప్లాప్ తో వెంటనే బయటపడ్డ టాలీవుడ్ హీరోయిన్ సమంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించింది. ఇటీవలే 'సిటాడెల్' సెట్‌లోకి అడుగుపెట్టిందంటూ ఆ సిరీస్‌లో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ అప్డేట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆమె నటించిన 'ఖుషి' సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'నా రోజా నువ్వే' అనే పేరుతో రిలీజైన ఈ పాట.. తెలుగుతోపాటు మిగతా భాషల్లోనూ అందర్నీ ఆకట్టుకుంటోంది.

 రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న లేటేస్టి చిత్రం 'ఖుషి'. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇటీవల సామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్లయిన విజయ్, సమంత.. మొదటిసారి జంటగా నటిస్తుండడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రిలీజయ్యే అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీలోని ఫస్ట్ సింగిల్ 'నా రోజా నువ్వే' ప్రోమో సాంగ్ రిలీజ్ కావడంతో.. సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమలోని మధుర భావాలకు అద్దం పట్టేలా ఉందని కొనియాడుతున్నారు. కాగా దీనికి సంబందించిన పూర్తి లిరికల్ సాంగ్ ను విజయ్ బర్త్ డే (మే 9న) సందర్భంగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.  

అందమైన ప్రేమ కథా చిత్రంగా 'ఖుషి' సినిమా తెరకెక్కుతోంది. మరో ముఖ్య విషయమేమిటంటే విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ప్రతి ఒక్కరికి తమ ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి తదితరులు నటిస్తున్నారు. హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం వహించిన ఈ ఫిలింకు.. శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. కాగా‘ఖుషి’ సినిమాను  శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇక గుణ శేఖర్ దర్శకత్వంలో ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన 'శాకుంతలం' సినిమా.. సామ్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది. సినిమాను అగ్ర భాగాన నిలబెడతాయని భావించిన విజువల్ ఎఫెక్ట్సే.. మూవీకి ఫ్లాప్ టాక్ తెచ్చేలా చేశాయి. ఈ మూవీకి ముందు నుంచే భారీ హైప్ తీసుకొచ్చినా.. విడుదలైన రోజు నుంచే నెగెటిన్ టాక్ వచ్చింది. సమంతతో పాటు పలువురు నటనకు న్యాయం చేశారనే అనిపించినా.. విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత వసూళ్లు కలెక్ట్ చేయలేకపోయింది.

Published at : 07 May 2023 05:02 PM (IST) Tags: Vijay Devarakonda Shiva Nirvana Kushi Samantha Na roja Nuvve Song Release

సంబంధిత కథనాలు

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !