News
News
X

రజినీ to చియాన్ - గుండె సమస్యలతో బాధపడుతున్న సినీ నటులు వీరే!

సినీ ఇండస్ట్రీలో అనేకమంది నటీనటులు గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రజినీకాంత్, సుష్మితా సేన్, రేణు దేశాయ్, బ్రహ్మానందం, సైఫ్ అలీఖాన్, శివాజీ రాజా, విక్రమ్.. ఇలా పెద్ద లిస్టే అవుతుంది.

FOLLOW US: 
Share:

సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినీ సెలబ్రిటీలలో.. తెర వెనుక అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్న వారు ఉన్నారు. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. వారు కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్లు, పర్షనల్ డైటీషియన్‌లు, ఆరోగ్య స్పృహ ఉన్నప్పటికీ.. సెలబ్రిటీలు గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులకు గురవడం మనం చూశాం. వారిలో కొందరు స్టార్స్ అదృష్టవశాత్తు హార్ట్ స్ట్రోక్ నుంచి బయటపడ్డారు. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ తో బాధపడిన నటీనటుల ఎవరో ఇప్పుడు చూద్దాం!

రజనీకాంత్

72 ఏళ్ల సూపర్‌ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ లో ఎన్నోసార్లు అనారోగ్యం బారినపడ్డారు. ఆయన 2021 అక్టోబర్ లో కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేయించుకున్నారని నివేదికలు ఉన్నాయి. ఇది మెదడుకు రక్త సరఫరాను పునరుద్ధరించే ప్రక్రియ అని చెప్పాలి. చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో రజినీ విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకొని, కొద్ది రోజుల్లోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎప్పటిలాగే తలైవార్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

రేణు దేశాయ్

'బద్రి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, రచయితగా దర్శకురాలిగా మల్టీటాలెంటెడ్ అనిపించుకుంది. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే కొంతకాలంగా ఆమె గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల వెల్లడించింది. 

సుస్మితా సేన్

హైదరాబాద్‌ లో పుట్టి పెరిగిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్.. 1996 హిందీ చిత్రం ‘దస్తక్’ తో సినీ రంగ ప్రవేశం చేసింది. అక్కినేని నాగార్జున సరసన ‘రక్షకుడు' చిత్రంలో నటించింది. ఇటీవలే ఆమె హార్ట్ ఎటాక్ నుంచి బయటపడింది. గుండెకు యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 

చియాన్ విక్రమ్

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ఆడియెన్స్ ను అలరించారు. ఇటీవల చియాన్ కు ఛాతిలో అసౌకర్యం కలగడంతో చెన్నై ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. చికిత్స పొందిన తరువాత, ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడని తెలిసింది. 

బ్రహ్మానందం

హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు ఛాతీలో అసౌకర్యం కలగడంతో ఆ మధ్య బైపాస్ హార్ట్ సర్జరీ జరిగింది. 1000కు పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం.. ఇటీవల 'పంచతంత్రం', 'వీరసింహా రెడ్డి' లో కనిపించారు. త్వరలో 'రంగమార్తండ' సినిమాతో పలకరించబోతున్నారు.

శివాజీ రాజా

తెలుగు నటుడు శివాజీరాజా ఇటీవల గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆయనకు హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని సమాచారం.

సైఫ్ అలీ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ 2013లో గుండెపోటుతో బయటపడ్డాడని వార్తలు వచ్చాయి. ముంబై లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందిన తర్వాత, ఆయన సాధారణ స్థితికి చేరుకున్నాడని చెప్పబడింది. సైఫ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

Also Read : వెంకటేష్ మహా రాజేసిన రగడ - 'కెజియఫ్' ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన మిగతా ముగ్గురు

Published at : 07 Mar 2023 12:30 PM (IST) Tags: Tollywood Renu Desai Rajinikanth Vikram Bollywood Saif Kollywood Brahmanandham Sushmitha Sen

సంబంధిత కథనాలు

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..

Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..

18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు

18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు

Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు

Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు

Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!

Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్‌తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?