Fauzi Poster Shloka Meaning: ప్రభాస్ 'ఫౌజీ' శ్లోకం మీనింగ్... హీరో క్యారెక్టర్‌లో ఆ ముగ్గురి లక్షణాలు!?
Prabhas Fauzi First Look: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ మీద ఓ శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం ఏమిటో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (Prabhas Birthday) సందర్భంగా 'ఫౌజీ' ఫస్ట్ లుక్ (Fauzi Movie First Look) విడుదల చేశారు. అది ఫ్యాన్స్ అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. అయితే... ఆ పోస్టర్ గమనించారా? నిశితంగా చూస్తే... పోస్టర్ మీద కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి. మొత్తం కలిపితే ఒక శ్లోకం అవుతుంది. ఆ శ్లోకం మీనింగ్ ఏమిటో తెలుసా?
'ఫౌజీ' పోస్టర్ మీద శ్లోకం ఇదే!
पद्मव्यूह विजयी पार्थः (పద్మవ్యూహ విజేత పార్థ)
पाण्डवपक्षे संस्थित कर्णः। (పాండవపక్షే సంస్థ కర్ణ)
गुरुविरहितः एकलव्यः (గుర్విరహిత ఏకలవ్య)
जन्मनैव च योद्धा एषः॥ (జన్మనేవ చ యోధా ఏషః)
- ఇదీ 'ఫౌజీ' పోస్టర్ మీద ఉన్న శ్లోకం. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ హీరో గురించి పేర్కొన్న శ్లోకం కూడా ఇదే.
మరి ఆ శ్లోకం మీనింగ్ ఏమిటంటే?
'ఫౌజీ' ప్రీ లుక్ పోస్టర్స్ మీద 'పద్మవ్యూహ విజేత పార్థ' అక్షరాలు కనిపించాయి. పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు అని, హీరోలో అర్జునిడి లక్షణాలు ఉంటాయని అర్థమైంది. అయితే... ఇప్పుడు పూర్తి శ్లోకం చూస్తే కథానాయకుడి పాత్ర మీద మరింత స్పష్టత వస్తుంది.
Also Read: 'సలార్' రీ రిలీజ్ రివ్యూ... ఫ్యాన్స్ అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయ్, వాళ్ళకు పూనకాలే!
పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడిగా, గురువు లేని ఏకలవ్యుడిగా, జన్మతః యోధుడిగా పేర్కొన్నారు. మహాభారతంలో కౌరవుల పక్షాన కర్ణుడు నిలబడ్డాడు. స్నేహధర్మం పాటించాడు. అయితే... ఇక్కడ పాండవుల పక్షాన కర్ణుడిగా హీరోని పేర్కొన్నారు. అంటే... ధర్మం వైపు కర్ణుడు నిలబడ్డారని చెప్పారు. మొదటి లైనులో అర్జునుడు అన్నారు. రెండో లైనులో కర్ణుడు అన్నారు. మూడో లైనులో ఏకలవ్యుడిగా పేర్కొన్నారు. పుట్టడంతోనే యోధుడు అంటున్నారు. చూస్తుంటే దర్శకుడు హను రాఘవపూడి యూనిక్ క్యారెక్టరైజేషన్, కథ రాసినట్టు ఉన్నారు. సినిమా మీద ఒక్క లుక్, శ్లోకంతో అంచనాలు పెంచారు.
Also Read: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ థియేటర్లు ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
View this post on Instagram
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఫౌజీ' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి కథానాయిక. ఆమెకు తొలి చిత్రమిది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద కీలక తారాగణం. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.





















