Faria Abdullah: 'గామా'లో ఫరియా అబ్దుల్లా స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్... ఇంకా హైలైట్స్ ఏమిటంటే?
Gama Awards 2025: ఆగస్టు 30న దుబాయ్ వేదికగా 'గామా అవార్డ్స్ 2025'ను ఓ వేడుకలా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అందులో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.

''మాది కమర్షియల్ ఈవెంట్ కాదు. మా నాన్న గారికి (త్రిమూర్తులు) కళాకారులు, కళల పట్ల ఉన్న అభిమానంతో ప్రతి ఏడాది గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నాం. ఈ నెల 30న దుబాయ్ వేదికగా వేడుకలా నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి మరింత ఘనంగా ఇతర దేశాల్లోనూ అవార్డ్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం'' అని 'గామా' సీఈవో సౌరభ్ కేసరి తెలిపారు.
ఆగస్టు 30వ తేదీన దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా 'గామా అవార్డ్స్' జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారని హైదరాబాద్ సిటీలో నిర్వహిచిన కర్టైన్ రైజర్ ఈవెంట్‌లో సౌరభ్ కేసరి, జ్యూరీ మెంబర్స్ తెలిపారు. అందులో ఫరియా అబ్దుల్లా స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.
'గామా అవార్డ్స్ 2025'లో స్పెషల్ డ్యాన్స్ పెరఫార్మన్స్ ఇవ్వనున్నట్టు ఫరియా అబ్దుల్లా కన్ఫర్మ్ చేశారు. ''లాస్ట్ ఇయర్ గామా అవార్డులకు వెళ్లాను. అయితే అప్పుడు డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. మా ఫ్యామిలీలో మలయాళీలు ఎక్కువ. గల్ఫ్ అంటే మాకు మినీ కేరళ. కానీ, అక్కడ తెలుగు ప్రజలు సైతం ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళ వైబ్ ఎలా ఉంటుందో చూశాను. ఈ ఇయర్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నాను'' అని ఫరియా అబ్దుల్లా తెలిపారు. తాను కూడా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నట్లు మరొక హీరోయిన్ మానసా వారణాసి తెలిపారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ వీడియో... ఫ్రీగా హరిహర వీరమల్లు ఫస్ట్ ఫైట్ చూడొచ్చు... లింక్ క్లిక్ చేయండి
ఇటువంటి అవార్డులు నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివని 'గామా' జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఎ కోదండ రామిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది సైతం అవార్డ్స్ ప్రోగ్రాం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ''ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డుల్లో భాగం కావడం సంతోషంగా ఉంది'' అని గామా అవార్డ్స్ టైటిల్ స్పాన్సర్ వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బి గోపాల్, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాలతో కలిసి 'వైవా' హర్ష ఈవెంట్ హోస్ట్ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించిన 'గామా అవార్డ్స్' థీమ్ సాంగ్ విడుదల చేశారు.
'గామా అవార్డ్స్'కు ఎవరెవరు వస్తున్నారంటే?
గామా అవార్డులకు యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్ మేక, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఊర్వశి రౌతేలా, కేతికా శర్మ, ప్రియా హెగ్డే, శ్రీదేవి తదితరులతో పాటు ప్రత్యేక అతిథులుగా బ్రహ్మానందం, సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, దేవిశ్రీ ప్రసాద్, అశ్వినీదత్, డీవీవీ దానయ్య, చంద్రబోస్, 'వెన్నెల' కిశోర్ తదితర ప్రముఖులు హాజరు అవుతారని గామా నిర్వాహకులు తెలిపారు.
Also Read: పరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!





















