అన్వేషించండి

AP Crime News: మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం

Minor girl Molestation | ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

NTR District Crime News | నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో దారుణం జరిగింది. నలుగురు యువకులు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు, మరో యువకుడితో కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఒంటరి బాలికపై దారుణం..

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముప్పాళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో పాటు విజయవాడకు చెందిన మరో యువకుడు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. బాలిక శరీరంలో నిందితులు కొరికిన గాయాలు ఉన్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోక్సో, ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వేగంగా స్పందించారు. మైనర్ బాలిక కావడంతో పోలీసులు పోక్సో (POCSO), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.  పోలీసులు కావాలనే ఈ కే‌సును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నాల్గవ నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

తాము పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించి నలుగురు యువకులు తన కూతురిపై పశువులా ప్రవర్తించారని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చి చూడగా చాలా మంది అక్కడ ఉన్నారని, లోపలికి వెళ్లి చూడగా కూతురు భయపడుతూ గాయాలతో కనిపించిందన్నారు. కింద పడి దెబ్బలు తగిలాయని చెప్పే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురి శరీరంపై గాయాలు చూస్తే ఎంతగానో వేధించారని తెలుస్తుందని, నిందితులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేయాలని ఆమె మేనమామ డిమాండ్ చేశారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొన్ని గంటల తరువాత డాక్టర్లు ఆమెకు చికిత్స చేశారని తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Advertisement

వీడియోలు

పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
అబ్బాయిలకో న్యాయం?  అమ్మాయిలకో న్యాయమా?
3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Kumbh Mela Mona Lisa: మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ -   తెలుగు సినిమాల్లో ఎంట్రీ
మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ - తెలుగు సినిమాల్లో ఎంట్రీ
Balakrishna: ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
Embed widget