అన్వేషించండి

Fahadh Faasil: యాక్టింగ్‌కు గుడ్ బై చెప్తే క్యాబ్ డ్రైవర్ అవుతా - అసలు రీజన్ ఏంటో చెప్పిన పహాద్ ఫాజిల్

Maareesan Movie: తనకు క్యాబ్ డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టమని మూవీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటానని మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు.

Fahadh Faasil Wants To Becoming A Cab Driver: డిఫరెంట్ రోల్స్, వైవిధ్యమైన నటనతో టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఫహాద్ ఫాజిల్. భాష ఏదైన తనదైన శైలిలో డైలాగ్స్, యాక్టింగ్‌తో మెప్పించారు. పుష్ప, పుష్ప 2 మూవీస్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా తన నటనతో మెప్పించి తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేశారు. తాజాగా కామెడీ థ్రిల్లర్ 'మారీశన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వడివేలు కీలక పాత్ర పోషించారు.

క్యాబ్ డ్రైవర్ అవుతా...

శుక్రవారం 'మారీశన్' రిలీజ్ కాగా... తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఫహాద్. తనకు క్యాబ్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని... సినిమాలు చేయడం పూర్తైతే ఆ పని చేసుకుంటానని అన్నారు. 'మేము కొన్ని నెలల క్రితం బార్సిలోనా వెళ్లాం. నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అది. ఆడియన్స్ నన్ను సిల్వర్ స్క్రీన్‌పై చూసి 'ఇక చాల్లే చూడలేకపోతున్నాం..' అనుకున్న రోజున నేను మూవీస్ మానేస్తాను. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్లి సెటిల్ అవుతాను.

అక్కడ క్యాబ్ డ్రైవింగ్ చేస్తా. ప్రజలను ఓ చోటి నుంచి మరో చోటుకి తీసుకెళ్తాను. ఆ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏదో ఫన్నీగా చెప్పడం లేదు. ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చడం కంటే మంచి విషయం ఏముంటుంది. డ్రైవింగ్ నాకు ఎప్పుడూ బోర్ కొట్టదు. అందుకే నేను సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత స్పెయిన్‌‌లోని బార్సిలోనా వెళ్లి అక్కడ ఉబర్ డ్రైవర్‌గా వర్క్ చేస్తాను.' అని ఫహాద్ స్పష్టం చేశారు.

Also Read: షూటింగ్ సెట్స్‌లోకి మక్కల్ సెల్వన్ - సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన పూరీ జగన్నాథ్ టీం

అయితే, గతంలోనూ పలు ఇంటర్వ్యూల్లో ఫహాద్ ఇదే విషయాన్ని చెప్పారు. తన భార్య నజ్రియాకు ఇదే విషయాన్ని చెప్పానని... ఆమె కూడా సంతోషంగా ఒప్పుకొన్నట్లు తెలిపారు. క్యాబ్ డ్రైవింగ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 'సినిమాలు కాకుండా నాకు ఏ పని ఇష్టమంటే కచ్చితంగా క్యాబ్ డ్రైవింగ్ అని చెప్తా. ఉబర్ డ్రైవర్‌గా ఉండడం కన్నా నాకు సంతృప్తి, ఆనందం ఇచ్చే పని మరొకటి ఉండదు. బార్సీలోనా వెళ్లి స్పెయిన్ మొత్తం తిరుగుతూ ప్రజలను తిప్పుతుంటాను.' అంటూ గత ఇంటర్వ్యూల్లో చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే... ఫహాద్ లేటెస్ట్ మూవీ 'మారీశన్'కు సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. వడివేలు కీలక రోల్ పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ డ్రామా మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీపై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. 'కైయేతుం దూరత్' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫహాద్ తమిళ, తెలుగు, హిందీ మూవీస్‌లో నటించి మెప్పించారు. పుష్ప, పుష్ప 2 మూవీస్ టాలీవుడ్‌లో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget