News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

‘పుష్ప 2’లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ - అంచనాలు పెంచేస్తోన్న ఫహాద్ ఫాజిల్ కామెంట్స్

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'పై క్రేజీ అప్ డేట్ రివీల్ అయింది. ఈ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ గా నటించిన ఫహాద్ ఫాజిల్.. తన పాత్ర పార్ట్ 1 కంటే కాస్త ఎక్కువగానే ఉండనున్నట్టు వెల్లడించారు

FOLLOW US: 
Share:

Fahad Fazil on Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప 2(Pushpa 2)' మరోమారు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు సమాయత్తం అవుతోంది. ప్రేక్షకుల అంచనాలను తలదన్నేలా రిలీజై, భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన 'పుష్ప పార్ట్ 1'ను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 'పుష్ప 2' గురించి చెప్పాలంటే ఈ సినిమాకు సంబంధించి ఇంతకుమునుపే రిలీజైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మెడలో నిమ్మకాల దండ, చీరకట్టులో కనిపించిన అల్లు అర్జున్ వేషధారణ ఇప్పటికీ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. 'పుష్ప: ది రైజ్’ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పైనా అంతకుమించిన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఎప్పుడు, ఎలాంటి అప్ డేట్స్ వస్తాయా అని సినీ ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలోనే 'పుష్ప 2' మూవీపై ఓ ఇంట్రస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. పార్ట్ 1లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'పుష్ప 2'లో తన పాత్ర పార్ట్ 1 కంటే కాస్త ఎక్కువగానే ఉండనున్నట్టు ఫాజిల్ చెప్పుకొచ్చారు. ఈ మూవీలో హీరో బన్నీకి, తనకు చాలా యాక్షన్ సీన్స్ కూడా ఉండనున్నట్టు తెలియజేశారు. పార్ట్ 2లో చాలా వరకు ఫైట్ సీన్సే ఉండనున్నాయని ఫాజిల్ ఇచ్చిన హింట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొన్నటిదాకా ఈ సినిమా ఎలా ఉండనుంది, ఎలాంటి సీన్స్ ఉండనున్నాయన్న సందేహాలకు ఫాజిల్ సమాధానాలు బన్నీ ఫ్యాన్స్‌లో అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.

ఇక 'పుష్ప 2' ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుండగా.. ఈ సీక్వెల్ లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) నటించనుండగా.. పాన్ ఇండియా(Pan India) లెవల్లో ఈ సినిమా వివిధ భాషల్లో రిలీజ్ కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం ఆసక్తికరంగా, మరింత యాక్షన్ ప్యాక్ గా ఉండనుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కాగా ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్(Ranvir Singh) అతిథి పాత్రలో నటించనున్నాడని సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోడానికే ఈ ప్లాన్ అని తెలుస్తోంది.

Read Also : Skanda Title Glimpse: రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ - గ్లింప్స్ వీడియో అదిరింది!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Jul 2023 12:34 PM (IST) Tags: Allu Arjun Rashmika Mandanna Sukumar Pushpa 2 Fahad Fazil Pan India Movie

ఇవి కూడా చూడండి

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

'హాయ్ నాన్న'లో శృతి సాంగ్, రష్మిక కొత్త సినిమా, 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

'హాయ్ నాన్న'లో శృతి సాంగ్, రష్మిక కొత్త సినిమా, 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి

IND Vs AUS, Match Highlights:  మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి