Skanda Title Glimpse: రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ - గ్లింప్స్ వీడియో అదిరింది!
రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజాగా ఈ మూవీకి ‘స్కంద’ అనే పేరు పెట్టారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అదిరిపోయే టైటిల్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ‘స్కంద’ అనే పేరును ఖరారు చేశారు. ‘ది అటాకర్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. నీటిలో ఖడ్గంతో శత్రువులను చీల్చి చెండాడుతున్న రామ్ విజువల్స్ విడుదల చేశారు. ‘నేను దిగితే ఓడేది ఉండదు. నేను దిగితే మిగిలేది ఉండదు” అంటూ రామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు అభిమానులలో రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. అదిరిపోయే టైటిల్ గింప్స్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ దెబ్బతో రామ్ కెరీర్లో మరో ఊరమాస్ హిట్ పడటం ఖాయమని భావిస్తున్నారు.
పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ‘స్కంద’
‘స్కంద’ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతోంది. తెలుగు తో పాటు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యూట్యూబ్ హిందీ డబ్బింగ్‌ల ద్వారా రామ్ ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు రామ్ పోతినేనిపరిచయం అయ్యాడు. ఇక ‘అఖండ’ దేశ వ్యాప్తంగా సంచనల విజయాన్ని అందుకుంది. బోయపాటి తెరకెక్కించిన పలు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు ఓ రేంజిలో వ్యూస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాకు మంచి ప్రమోషన్ నిర్వహించి, హిందీ మార్కెట్లో సంచలన విజయాన్ని అందుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఊర మాస్ గా కనిపించనున్న హీరో రామ్
ఇక ‘స్కంద’ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ చిత్రంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. రామ్, శ్రీలీల జంట సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వాస్తవానికి బోయపాటి సినిమా అంటేనే హీరో క్యారెక్టర్ చాలా మాసీగా ఉంటుంది. యాక్షన్ సీన్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ సినిమాను కూడా తన రేంజికి ఏమాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నారు. రామ్ ను ఈ సినిమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మాసీగా చూపించబోతున్నారట.
View this post on Instagram
అక్టోబర్ నుంచి సెప్టెంబర్ కు మారిన ‘స్కంద’ రిలీజ్ డేట్
‘స్కంద’ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు రీసెంట్ గా కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ‘ది వారియర్’ తర్వాత రామ్, ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
Read Also: ఇట్స్ అఫీషియల్ - బన్నీతో త్రివిక్రమ్ నాలుగో మూవీ, హీరోయిన్ ఆమేనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial