అన్వేషించండి

Extra Jabardasth Latest Promo : 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో వైఎస్ జగన్ సర్కార్ పెన్షన్  మీద పంచ్!

ఏపీలో ఎన్నికల హంగామా మొదలైంది. అది రియాలిటీ షోల్లోనూ కనబడుతోంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో పంచ్ పడింది.

పెన్షన్... వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే ఆసరా! రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణలో 2016 రూపాయలు ఇస్తుంటే... మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh Pension Scheme)లో రూ. 2750 ఇస్తున్నాయి. ఇప్పుడీ పెన్షన్ ప్రస్తావన ఎందుకు? అంటే... కామెడీ రియాలిటీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ఏపీలో ఇచ్చే పెన్షన్ మీద పంచ్ పడింది.

ప్రభుత్వం మారితే...
పెన్షన్ పెరుగుతుంది!
'ఎక్స్ట్రా జబర్దస్త్' షోలో 'బుల్లెట్' భాస్కర్ ఓ టీమ్ లీడర్. ఆయన నేతృత్వంలో కొంత మంది స్కిట్స్ చేస్తూ ఉన్నారు. ఈ వారం టెలికాస్ట్ కానున్న స్కిట్ కోసం సొంత తల్లిదండ్రులను భాస్కర్ తీసుకు వచ్చారు. భాస్కర్ తండ్రికి ఇంతకు ముందు కొన్ని స్కిట్స్ చేసిన అనుభవం ఉంది. ఆయన తల్లి మొదటిసారి 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో కనిపించారు. ప్రోమోలో ఆవిడ వేసిన పంచ్ డైలాగ్స్ అందరినీ అలరించాయి.

'బుల్లెట్' భాస్కర్ స్కిట్ థీమ్ ఏంటంటే... తండ్రికి మళ్ళీ పెళ్లి! పెళ్లి చూపుల్లో ఓ అమ్మాయి ప్రశ్నలు వేస్తుంటే... భాస్కర్ తల్లి సమాధానాలు ఇచ్చారు. 'ఆయనకు నెలనెలా ఆదాయం ఎంత వస్తుంది?' అని అడిగితే... ''2750 రూపాయలు వస్తుంది అమ్మా!'' అని చెబుతారు. 'అదేంటి? ఏమీ పెరగదా?' అని మళ్ళీ అడిగితే... ''ఏం పెరగదు. గవర్నమెంట్ మారితే పెరుగుతుంది'' అని చెబుతారు. 

'బుల్లెట్' భాస్కర్ టీమ్ చేసిన స్కిట్, ప్రోమోలోని ఆ డైలాగుల్లో ఏపీ ప్రస్తావన లేదు. అయితే, ప్రస్తుతం 2750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది ఆంధ్రాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ కనుక... వాళ్ళ మీద పంచ్ వేశారని ప్రజలు భావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మారితే పెన్షన్ పెరుగుతుందని 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో పరోక్షంగా చెప్పినట్టు అయ్యిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ పంచ్ వేసిన తర్వాత జడ్జ్ స్థానంలో ఉన్న ఖుష్భూ క్లాప్స్ కొట్టడం గమనార్హం.

Also Read : రవితేజ సినిమాలో శర్వా బదులు విశ్వక్ సేన్ - విలన్‌గా మంచు మనోజ్?

ఇటీవల తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ... తమ ప్రభుత్వం వస్తే పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ సర్కార్ రెండు వేల రూపాయలు అందిస్తోంది. ఏపీలోనూ ప్రస్తుతం ఎన్నికల హంగామా మొదలు అయ్యింది. అక్కడ పోటీ చేసే పార్టీలు మేనిఫెస్టోలో పెన్షన్ గురించి తప్పకుండా హామీలు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎంత పెంచుతామని చెబుతారో చూడాలి. ఇటు తెలంగాణ... ఇటు ఏపీ... ఎన్నికల వేడి పెరిగే కొలదీ, నేతలు ఇచ్చే హామీలపై రియాలిటీ షోలలో పంచ్ డైలాగులు పడే అవకాశం పుష్కలంగా ఉంది.


 
సుధీర్ లేడు గానీ...
పంచ్ ఉంటుంది!
హీరోగా వరుస అవకాశాలు వస్తుండటంతో ప్రస్తుతం 'సుడిగాలి' సుధీర్ కామెడీ షోలు చేయడం లేదు. ఆయన 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు టాటా చెప్పేశారు. షోలో ఆయన ఉండటం లేదు. కానీ, ఆయన మీద పంచ్ డైలాగ్స్ మాత్రం ఉంటున్నాయి. రష్మీ గౌతమ్, సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అని జరిగే ప్రచారం గురించి తెలిసిందే. కలిసి షో చేయకపోయినా బయట కలుస్తున్నారని ఆ మధ్య ఇమ్మాన్యుయేల్ పంచ్ వేశారు. ఈ వారం ప్రవీణ్ కూడా వాళ్ళ మీద పంచ్ వేశారు. 

Also Read షారుఖ్ ముక్కుకు బ్యాండేజ్ - అమెరికాలో జరిగిన ప్రమాదం ఏమిటంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget