Mass Ka Das Vishwaksen: మాస్ కా దాస్ మాములు సంక్రాంతి ట్రీట్ కాదిది.. చూస్తే ప్రేమలో పడాల్సిందే!
Vishwaksen Laila Look: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మధ్య వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న లైలా నుండి ఊహించని విధంగా సంక్రాంతి ట్రీట్‌ని ఇచ్చేశాడు.
Vishwaksen as Lalia : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి సంక్రాంతి ట్రీట్ వచ్చేసింది. అది మాములు ట్రీట్ కాదు. అసలు విశ్వక్ అభిమానులు కూడా ఊహించని ట్రీట్ ఇది. మనిషన్నాక కూసంత కళాపోషణ ఉండాలి అన్నట్లే.. నటుడన్నాక అన్నిరకాల పాత్రలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఫ్యాన్స్ కోసం మూసధోరణిలో ఒకే తరహా పాత్రలు చేయాల్సి వస్తుంది కానీ, నటుడిగా పేరు తెచ్చుకోవాలంటే మాత్రం కచ్చితంగా వైవిధ్యమైన పాత్రలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండోదే విశ్వక్ సేన్ ఫాలో అవుతున్నాడు. తనని నటుడిగా నిలబెట్టుకునేందుకు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ఎవరూ ఊహించని విధంగా కనిపించబోతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదో అర్థమైందా?.. ‘లైలా’.
టైటిల్‌తోనే ప్రేక్షకులంతా మాట్లాడుకునేలా చేసిన ఈ సినిమాలో.. ఇప్పటి వరకు విశ్వక్ కనిపించని ఓ వైవిధ్యమైన పాత్రలో కనువిందు చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ లేడీ గెటప్‌లో విశ్వక్ నటిస్తున్న ‘లైలా’ సినిమా నుండి సంక్రాంతి స్పెషల్ అప్డేట్స్ వదిలారు. ఈ చిత్ర టీజర్‌ని జనవరి 17న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ సంక్రాంతి విషెస్‌తో ఓ స్పెషల్ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో విశ్వక్ సేన్‌ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అసలీ పోస్టర్‌లో ఉంది విశ్వక్ సేనేనా? అనేలా అతని సారీ.. ఆమె మేకోవర్ ఉంది.
‘లైలా’ అవతార్‌లో విశ్వక్ సేన్ లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు. పింక్ కలర్ థీమ్‌తో స్త్రీ ప్రకాశాన్ని మరింత జోడించేలా పోస్టర్‌ని డిజైన్ చేసిన మేకర్స్.. పోస్టర్‌లో ‘లైలా’ని అద్భుతంగా చూపించారు. నిజంగా ఒక బ్యూటీఫుల్ గర్ల్ ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది. అద్భుతమైన మేకప్‌తో, సింబాలిక్ భంగిమలో.. పెదవులపై వేలు పెట్టి.. సైలెంట్‌గా ఉండండి అనేలా సిగ్నల్స్ పంపుతుంది. పోస్టర్‌పై పింక్ కలర్ సీతాకోకచిలుకలు రెపరెపలాడుతున్నట్లుగా చూపించిన తీరు వావ్ అనిపిస్తుంది. మొత్తంగా అయితే.. అసలీ పోస్టర్‌లో ఉంది ఒక మగాడు అని అంటే నమ్మడానికి వీలు లేని విధంగా.. అమ్మాయి అవతారంలో విశ్వక్ సేన్ ఇమిడిపోయాడు. చూస్తుంటే, ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్‌ను టర్న్ చేసే సినిమా అవుతుందనే వైబ్‌ని ‘లైలా’ పోస్టర్‌తోనే కల్పించేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్ చూసిన విశ్వక్ ఫ్యాన్స్ అయితే అద్దిరిపోయే ట్రీట్ ఇచ్చావ్ అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#Laila wishes you a Happy Sankranthi 🩷#LailaTeaser out on January 17th ✨
— VishwakSen (@VishwakSenActor) January 14, 2025
GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹
@RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/vlgUDRDkAz
విశ్వక్ సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తున్న ఈ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన పోస్టర్, పాట, ఇప్పుడొచ్చిన స్పెషల్ లుక్.. ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఈ సినిమాను వాలంటైన్ డే కానుకగా 14 ఫిబ్రవరి, 2025న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.