![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Entertainment Top Stories Today: 'దేవర' టీమ్ ఇంటర్వ్యూ to 'సైమా 2024' అవార్డ్స్, 'మత్తు వదలరా 2' అప్డేట్స్ వరకు - ఈ రోజు టాప్ ఫిల్మ్ న్యూస్
Entertainment News Today In Telugu: 'దేవర' టీమ్ ఇంటర్వ్యూ నుంచి 'సైమా 2024'అవార్డ్స్, 'మత్తు వదలరా 2' మీద స్టార్స్ ప్రశంసల వరకు ఈ రోజు టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ ఏమిటో చూడండి.
![Entertainment Top Stories Today: 'దేవర' టీమ్ ఇంటర్వ్యూ to 'సైమా 2024' అవార్డ్స్, 'మత్తు వదలరా 2' అప్డేట్స్ వరకు - ఈ రోజు టాప్ ఫిల్మ్ న్యూస్ Entertainment Top News Today in Telugu Devara Team Interview SIIMA 2024 winners September 15th Entertainment Top Stories Today: 'దేవర' టీమ్ ఇంటర్వ్యూ to 'సైమా 2024' అవార్డ్స్, 'మత్తు వదలరా 2' అప్డేట్స్ వరకు - ఈ రోజు టాప్ ఫిల్మ్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/27a52c0bf0e94072609776c4b9a9b6961726400380454313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'దేవర' హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ, కొరటాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటరాక్షన్ నుంచి దుబాయ్‌లో జరిగిన 'సైమా 2024' అవార్డ్స్ అండ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి, 'మత్తు వదలరా 2' మీద స్టార్ హీరోస్ ట్వీట్స్ వరకు... నేటి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ ఏమిటో చూడండి.
యాక్షన్ డ్రామా 'దేవర' గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారంటే?
'దేవర' ఒక యాక్షన్ డ్రామా అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చెప్పారు. ఆయనతో పాటు 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, దర్శకుడు కొరటాల శివతో 'యానిమల్' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూలో 'దేవర' టీమ్ చెప్పిన విశేషాలు ఏమిటి? ఇంకేం ఉన్నాయి? అనేది తెలుసుకోండి.
('దేవర' కోసం అనిరుద్ అందించిన మ్యూజిక్ నుంచి అండర్ వాటర్ సీక్వెన్స్, జాన్వీ కపూర్ రోల్ గురించి రివీల్ చేసిన విషయాలు తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
'సైమా' అవార్డుల్లో 'దసరా', 'హాయ్ నాన్న'తో నాని దూకుడు
'సైమా 2024' అవార్డుల్లో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తీసిన 'భగవంత్ కేసరి' ఉత్తమ సినిమాగా నిలిచింది. ఈ అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా', 'హాయ్ నాన్న' సినిమాలు మెజారిటీ అవార్డులు కొల్లగొట్టాయి. 'దసరా'లో నటనకు గాను నాని, కీర్తీ సురేష్ ఉత్తమ నటీనటులుగా నిలిచారు. ఎవరికి ఏయే అవార్డులు వచ్చాయి? అనేది తెలుసుకోండి.
(సైమా 2024 అవార్డుల్లో విన్నర్స్ ఎవరు? ఏయే సినిమాలకు అవార్డులు వచ్చాయి? అనేది తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కుమారి నుంచి శ్రీమతిగా మారిన మేఘా ఆకాష్... పెళ్లికి వచ్చిన సీఎం
తెలుగులో నితిన్ 'లై', 'చల్ మోహన్ రంగ' సినిమాలతో పాటు శ్రీ విష్ణు సూపర్ హిట్ సినిమా 'రాజా రాజా చోర'లో ఓ కథానాయికగా నటించిన అమ్మాయి మేఘా ఆకాష్. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేటా'లో కీలక పాత్ర చేశారు. సాయి విష్ణుతో ఈ రోజు ఆమె వివాహ బంధంలో అడుగు పెట్టారు. పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అటెండ్ అయ్యారు.
(మేఘా ఆకాష్ పెళ్లికి సంబందించిన వార్త చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
'మత్తు వదలరా 2' సినిమాకు చిరంజీవి, మహేష్ రివ్యూలు... కలెక్షన్స్ ఎంత?
'మత్తు వదలరా 2' సినిమా మీద స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఇంత నవ్వుకున్న సినిమా మరొకటి లేదని, ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశానని ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమాను ఎంజాయ్ చేశానని చెప్పారు. రెండు రోజుల్లో సినిమా 11 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించాయి.
('మత్తు వదలరా 2' గురించి చిరంజీవి ఏమన్నారో తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
(మత్తు వదలరా 2' గురించి మహేష్ బాబు చేసిన ట్వీట్ తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
డబ్బులు లేక ఫుట్‌పాత్‌పై పడుకున్నా... రాజ్ తరుణ్ షాకింగ్ కామెంట్స్!
యంగ్ హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య పెట్టిన కేసు సెన్సేషన్ అయ్యింది. 'పురుషోత్తముడు', 'తిరగబడర సామీ' తర్వాత వచ్చిన 'భలే ఉన్నాడే' డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా ప్రచార చిత్రాల్లో రాజ్ తరుణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. డబ్బులు లేక ఫుట్ పాత్ మీద పడుకున్న రోజులు ఉన్నాయని వివరించారు.
(రాజ్ తరుణ్ కామెంట్స్ చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)