By: ABP Desam | Updated at : 19 Apr 2022 04:51 PM (IST)
రాజ్ కుమార్ హిరాణీ, షారుఖ్ ఖాన్
'పఠాన్' (Pathaan) తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించనున్న సినిమా ఏది? ఈ ప్రశ్నకు కింగ్ ఆఫ్ రొమాన్స్ ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టారు. రాజ్ కుమార్ హిరాణీ (Rajkumar Hirani) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు ఈ వెల్లడించారు. ఆ సినిమాకు 'డంకి' (Dunki Movie) టైటిల్ ఖరారు చేశారు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన తాప్సి పన్ను నటించనున్నారు (Taapsee Pannu to share screen space with Shah Rukh Khan In Dunki).
షారుఖ్, రాజ్ కుమార్ హిరాణీ కలయికలో తొలి చిత్రమిది (Shah Rukh Khan - Raj Kumar Hirani first collaboration). 'మున్నాభాయ్' సిరీస్, 'పీకే', 'సంజు' సినిమాలతో రాజ్ కుమార్ హిరాణీ పేరు తెచ్చుకున్నారు. షారుఖ్‌తో తొలిసారి చేస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణీ ఆఫీసుకు షారుఖ్ వెళ్ళడం... ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
కామెడీ ఉందా? - షారుఖ్ ప్రశ్న
చాలా ఉంది! - రాజ్ కుమార్ హిరాణీ సమాధానం
మరి, ఎమోషన్? - షారుఖ్ సందేహం
అదీ ఉంది! - రాజ్ కుమార్ హిరాణీ భరోసా
రొమాన్స్ ఉందా సార్? - తన ఐకానిక్ ఫోజు పెడుతూ షారుఖ్ అడిగారు.
ఉంది సార్. కానీ, ఇలాంటిది అవాయిడ్ చేద్దాం! - రాజ్ కుమార్ క్లారిటీ
ఎటువంటి సినిమా తీస్తాడోనని చివర్లో షారుఖ్ చెప్పడం బావుంది.
Also Read: 'సలార్'కు మళ్ళీ లీకుల గోల - ఈసారి ఫ్యాన్స్ హ్యాపీ!
జానర్ ఏమిటి? సినిమా కథ ఏమిటి? అనేది చెప్పలేదు. కానీ, వచ్చే ఏడాది డిసెంబర్ 23న సినిమాను (Dunki Movie Release Date) విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అంటే... 2023లో షారుఖ్ నుంచి రెండు సినిమాలు రావడం కన్ఫర్మ్ అన్నమాట. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం నటిస్తున్న 'పఠాన్'ను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: కీర్తీ సురేష్‌కు లోయర్ బ్యాక్ మజిల్ స్పాజమ్! ఇప్పుడు ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Shah Rukh Khan (@iamsrk)
Thandel Movie: అట్టహాసంగా ‘తండేల్’ మూవీ లాంఛ్, ఏడాదిన్నరగా కష్టపడుతున్నామన్న నాగ చైతన్య
Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!
Bobby Deol: అమ్మ క్లైమాక్స్ చూడలేదు, ఆ సీన్ చూడలేనని ఏడ్చేసింది - ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Tanushree Dutta: అతడితో ముద్దు సీన్లు.. చాలా ఇబ్బందిపడ్డాను - కిస్సింగ్ కింగ్‌పై తనుశ్రీ షాకింగ్ కామెంట్స్
1134 Movie: నగరం నిద్రపోతున్న వేళ విరుచుకుపడిన దొంగలు - కారు నంబరే సినిమా టైటిల్!
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా
KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా
Look Back 2023: బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన సినిమాలు - 2023లో బ్లాక్‌బస్టర్స్
/body>