Balakrishna - NBK107 Movie Update: బాలకృష్ణ సినిమాలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా కన్నడ స్టార్
Sandalwood Sensation Duniya Vijay as Musali Madugu Pratap Reddy In NBK107 - Duniya Vijay first look from Balakrishna movie unveiled: బాలకృష్ణ సినిమాలో కన్నడ స్టార్ దునియా విజయ్ లుక్ విడుదల చేశారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రమిది. బాలకృష్ణ 107వ సినిమా కావడంతో NBK 107గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో దునియా విజయ్ నటిస్తున్నట్టు NBK 107 చిత్ర బృందం పేర్కొంది. సిగరెట్ వెలిగిస్తూ... చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. కళ్ళల్లో ఒక విధమైన విలనిజం కూడా చూపించారు. ఆయన ఫస్ట్ లుక్ కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
NBK107లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. మరోసారి వెండితెరపై తండ్రీ కొడుకులుగా ఆయన కనిపించనున్నారు. నీటి సమస్యలను సినిమా టచ్ చేస్తుందని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పారు. బాలకృష్ణ లుక్ విషయంలో చాలా రీసెర్చ్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలో బాలయ్య స్టయిల్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందని వివరించారు.
Also Read: బాలకృష్ణ సినిమా స్టోరీ లైన్ రివీల్ చేసిన దర్శకుడు
'అఖండ' విజయం తర్వాత బాలకృష్ణ, 'క్రాక్' సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిది. ఇద్దరి కలయికలో తొలి సినిమా కూడా ఇదే. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతీ హాసన్ కథానాయిక. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: బాలకృష్ణతో సినిమా ప్రకటించిన దర్శకుడు... స్క్రిప్ట్ రెడీ!
View this post on Instagram