Balakrishna New Movie (NBK107) Story: బాలకృష్ణ సినిమా స్టోరీ లైన్ రివీల్ చేసిన దర్శకుడు
NBK107లో బాలకృష్ణ లుక్ విడుదల కావడమే ఆలస్యం... కన్నడ సినిమా 'మఫ్టీ'కి రీమేక్ అని, ఇంకొకటి అని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా స్టోరీ లైన్ రివీల్ చేశారు.
Balakrishna New Movie - NBK107 Story line: పంచెకట్టు... నల్ల షర్టు... నుదుట బొట్టు... కళ్లకు చలువజోడు... మెడలో రుద్రాక్ష... NBK107లో నట సింహ నందమూరి బాలకృష్ణ లుక్ బావుంది. నందమూరి అభిమానులను మాత్రమే కాదు, ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ విడుదల కాకముందే షూటింగ్ లొకేషన్ నుంచి బాలకృష్ణ లుక్ లీక్ అయ్యింది. అప్పటినుంచి కన్నడ సినిమా 'మఫ్టీ'కి రీమేక్ అనే ప్రచారం నెట్టింట మొదలైంది. కన్నడ సినిమాలో శివ రాజ్ కుమార్ లుక్, బాలకృష్ణ లుక్ సేమ్ టు సేమ్ ఉన్నారని ఫొటోలను పక్క పక్కన పెట్టి మరీ పోస్టులు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా స్టోరీ లైన్ రివీల్ చేశారు.
NBK107లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ (Balakrishna Plays Dual Role In NBK107) చేస్తున్నారు. మరోసారి వెండితెరపై తండ్రీ కొడుకులుగా ఆయన కనిపించనున్నారు. నీటి సమస్యలను సినిమా టచ్ చేస్తుందని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పారు. బాలకృష్ణ లుక్ విషయంలో చాలా రీసెర్చ్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలో బాలయ్య స్టయిల్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందని వివరించారు.
Also Read: ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బాలకృష్ణ కుమార్తె ఫస్ట్ స్టెప్... 'అన్‌స్టాపబుల్' సక్సెస్ స్టెప్
'అఖండ' విజయం తర్వాత బాలకృష్ణ, 'క్రాక్' సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిది. ఇద్దరి కలయికలో తొలి సినిమా కూడా ఇదే. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతీ హాసన్ కథానాయిక. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో బాలకృష్ణ?
View this post on Instagram