Double Ismart OTT: 'డబుల్ ఇస్మార్ట్' ఓటీటీ పార్ట్‌నర్ ఇదే! - ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా?
Double Ismart OTT Partner Details: రామ్ పోతినేని-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ సో నుంచి ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Double Ismart OTT Release and streaming Details:ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ఐదేళ్ల క్రితం వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ ఇది. ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే దీంతో ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటిని మరింత రెట్టింపు చేసేలా ఉన్నాయి ఈ మూవీ అప్‌డేట్స్. దీంతో డబుల్ ఇస్మార్ట్ ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు (ఆగస్టు 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఫస్ట్ షో నుంచి ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. రామ్ ఎనర్జీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. సినిమాకు రామ్ యాక్టింగ్ బలం అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ చర్చనీయాంశం అయ్యింది.
ముందు నుంచి ఈ సినిమాకు బజ్ ఉండటంతో డబుల్ ఇస్మార్ట్ కోసం ఓటీటీ సంస్థలు భారీస్థాయిలో పోటీ పడ్డాయి. కానీ చివరి అమెజాన్ ప్రైం వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని దక్కించుకుంది. దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన లేదు థియేటర్లో మూవీ టైటిల్‌తో పాటు ఓటీటీ పార్ట్‌నర్ రివీల్ చేశారు. దీంతో డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్‌పై క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల్లో ఈ మూవీ డిజిటల్ రైట్స్ దాదాపు రూ. 33 కోట్లకుఅమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తర్వాతే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీకి రానుంది. అంటే సెప్టెంబర్ నెల చివరిలో అక్టోబర్ మొదటి వారంలోని కానీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందట. త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీకి సంబంధించి సదరు సంస్థ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని సమాచారం.
సినిమా కథ విషయానికి వస్తే..
ఈ సినిమా ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్‌తో స్టార్ట్ అవుతుందని, తర్వాత విలన్ ఎంట్రీ ఫైట్, హీరో ఇంట్రడక్షన్ ఫైట్... ఇలా ఫస్టాఫ్ మెల్లిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత రామ్, కావ్య థాపర్‌ల లవ్ ట్రాక్ ఆకట్టుకున్నా.. అది కూడా సోసోగా సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ సమయానికి 'డబుల్ ఇస్మార్ట్' అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండాఫ్‌లో బిగ్ బుల్ (సంజయ్ దత్), ఇస్మార్ట్ శంకర్ ఇద్దరికీ రెండు వేర్వేరు గోల్స్ ఉంటాయి. అది రివీల్ అయినప్పుడు ఇనిమా ఇంట్రస్ట్ కలిగిస్తాయి. ఆ తర్వాత నటి ప్రగతి పాత్రతో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు పూరీ.
కాగా పూరీ కనెక్ట్స్ బ్యానరో పూరీ జగన్నాథ్, చార్మీలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, షాయాజీ షిండే, అలీ, బాని జే, మార్కండ్ దేశ్‌పాండే,ఉత్తేజ్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను మణిశర్మ సంగీతం అందించారు. ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి గోల్ లేకుండా హీరోకు.. డబుల్ ఇస్మార్ట్ ఎమోషన్ టచ్ ఇచ్చాడట.
Also Read: డబుల్ ఇస్మార్ట్ రివ్యూ: రామ్, పూరి మాస్ సైన్స్ ఫిక్షన్ సీక్వెల్ ఎలా ఉంది? - రిజల్ట్ ‘డబుల్’ అయిందా?