అన్వేషించండి

Amitabh Bachchan: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు అమితాబ్ బచ్చన్‌లు - గ్రాఫిక్స్ కాదు, కెమేరా కిటుకు కాదు.. నిజం!

Amitabh Bachchan: తాజాగా ఒక వీడియోలో ఇద్దరు అమితాబ్ బచ్చన్‌లు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ అందులో ఒకరు మాత్రమే నిజమైన అమితాబ్.. మరొకరు అచ్చం ఆయనలాగా ఉండే డోపెల్గాంగర్.

Amitabh Bachchan Doppelganger: తాజాగా ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు అమితాబ్ బచ్చన్‌లు ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అందులో ఒకరు మాత్రమే ఒరిజినల్ అమితాబ్ బచ్చన్.. ఇంకొకరు మాత్రం అచ్చం ఆయనలాగా కనిపించే మరో వ్యక్తి. అంటే డోపెల్గాంగర్. మామూలుగా ఇప్పటివరకు ఎందరో బాలీవుడ్ స్టార్లను వారి డోపెల్గాంగర్స్ వచ్చి కలిశారు. అదే లిస్ట్‌లోకి అమితాబ్ బచ్చన్ కూడా చేరారు. ప్రస్తుతం అమితాబ్ నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్‌లోకి తన డోపెల్గాంగర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా అమితాబ్ కాళ్లపై పడి నమస్కరించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మిలియన్స్‌లో సబ్‌స్క్రైబర్స్..

అచ్చం అమితాబ్ బచ్చన్‌లాగా ఉన్న వ్యక్తి పేరు శశికాంత్ పెడ్వాల్. అయితే తాను అమితాబ్‌ను కలిసి విషయం తనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘గురుదేవ్‌తో పాటు మీ అందరి ఆశీస్సులతో ఈరోజు 2 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకున్నాం’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. అచ్చం అమితాబ్ లాగా ఉండడం వల్ల శశికాంత్‌కు చాలా ప్లస్ అయ్యింది. తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇక అదే కారణంతో ఏకంగా 2 మిలియన్స్ వరకు ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. 2 మిలియన్ మార్క్‌ను టచ్ చేసిన సందర్భంగా తను గురువుగా భావించే అమితాబ్‌ను కలిసి ఆశీస్సులు తీసుకోవాలని భావించారు శశికాంత్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shashikant Pedwal (@shashikant_pedwal)

డోపెల్గాంగర్స్‌కు క్రేజ్..

శశికాంత్ పెడ్వాల్ వృత్తిపరంగా ఒక ప్రొఫెసర్. అయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ షేర్ చేస్తూ నెటిజన్లకు దగ్గరయ్యారు. అమితాబ్ బచ్చన్ పోలికలతో ఉండడం తనకు చాలా ప్లస్ కూడా అయ్యింది. తనకంటూ ఒక సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. శశికాంత్ పెడ్వాల్ అఫీషియల్ అనే ఈ ఛానెల్‌కు దాదాపు 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇక హీరోలలాగానే వారి పోలికలతో ఉండే వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారని నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా ఒక పాకిస్థానీ ఫుడ్ వ్లాగర్ కూడా హీరో నాగార్జున పోలికలతో ఉండడం వల్ల నెలకు రూ.4 నుండి 5 లక్షల వరకు సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

అప్‌కమింగ్ సినిమాలు..

అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే.. ఆయన చివరిగా టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ‘గణపత్’లో కీలక పాత్రలో కనిపించారు. త్వరలోనే నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’లో కీ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి అమితాబ్ ఫస్ట్ లుక్ విడుదల కాగా.. అందులో ఆయనను ప్రేక్షకులు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అందులో ఒక ఋషి పాత్రలో అమితాబ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎవర్‌గ్రీన్ బ్లాక్‌బస్టర్ ఇంగ్లీష్ మూవీ ‘ది ఇంటర్న్’.. బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. అందులో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్‌లో నటించనున్నారు. తనతో పాటు మరో లీడ్ రోల్‌లో దీపికా పదుకొనె కనిపించనుంది.

Also Read: పాకిస్థాన్‌లో నాగార్జునను పోలిన వ్యక్తి - వీడియోలతో లక్షల్లో సంపాదన

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget