అన్వేషించండి

Nimrat Kaur : ఐశ్వర్యా రాయ్ భర్తతో డేటింగ్.. అభిషేక్ బచ్చన్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ నిమ్రత్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో  తెలుసా?

ఐశ్వర్యా రాయ్ భర్త, అభిషేక్ బచ్చన్ తో డేటింగ్ చేస్తోందంటూ ఇటీవల కాలంలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న నిమ్రత్ బ్యాక్గ్రౌండ్ ఏంటో  తెలుసా?

సినీ పరిశ్రమలో పెళ్లయిన జంటల విడాకులు, అఫైర్స్ వంటి వార్తలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్,  ఐశ్వర్య  రాయ్ బచ్చన్‌ లు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు చాలా కాలంగా విన్పిస్తున్నాయి. ఇంతలో అభిషేక్ సినీ పరిశ్రమలోని ఓ నటితో డేటింగ్ చేస్తున్నాడు అనే రూమర్లు బయల్దేరాయి. దీని కారణంగా జూనియర్ బచ్చన్ తో పాటు సదరు నటి కూడా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్. అభిషేక్ బచ్చన్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకారుతో ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించింది. మరి అసలు ఈ హీరోయిన్ ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను చూద్దాం పదండి. 

ఈ సినిమా సెట్లోనే పరిచయం 
ఐశ్వర్యరాయ్‌ కి దూరంగా ఉంటూ వస్తున్న అభిషేక్ బచ్చన్ ఇప్పుడు నటి నిమ్రత్ కౌర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్ 2022 సంవత్సరంలో విడుదలైన 'దస్వి' చిత్రంలో కలిసి కనిపించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ భార్య పాత్రలో నిమ్రత్ కౌర్ నటించింది. ఈ సినిమా తర్వాత వీరి ఎఫైర్‌పై రూమర్స్ ఊపందుకున్నాయి. అభిషేక్-ఐశ్వర్యకు సంబంధించి సోషల్ మీడియాలో విడాకుల రూమర్లు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే వీరిద్దరి డివోర్స్ కు కారణం అంటూ నిమ్రత్ కౌర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ ఈ విషయంపై ఇప్పటిదాకా బచ్చన్ కుటుంబం గానీ, ఐశ్వర్య రాయ్ కానీ స్పందించలేదు. 

నిమ్రత్ కౌర్ ఎవరు ?
42 ఏళ్ల బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్. ఆమె చాలా తక్కువ చిత్రాలలో పని చేసింది. నిమ్రత్ 19 ఏళ్ల క్రితం అంటే 2005లో విడుదలైన 'యహాన్' సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఈ చిత్రం తర్వాత ఆమె మరికొన్ని చిత్రాలలో నటించినప్పటికి అవి ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే 8 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ చిత్రం 'ది లంచ్‌బాక్స్'తో నిమ్రత్ కు నిజమైన గుర్తింపు వచ్చింది. నిమ్రత్ కౌర్ 'లంచ్‌బాక్స్' చిత్రంలో తన బలమైన నటనతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రశంసలు అందుకున్నారు. అనంతరం బాలీవుడ్ నుండి మొదలుకొని అనేక అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలో పని చేసింది. 'ది లంచ్‌బాక్స్'తో పాటు 'ఎయిర్‌లిఫ్ట్', 'దస్వీ', 'సజ్ని షిండే కా వైరల్ వీడియో' వంటి హిట్ చిత్రాలలో నటించింది. అలాగే ఆమె 'హోమ్‌ల్యాండ్', 'వేవార్డ్ పైన్స్' వంటి అమెరికన్ సిరీస్‌లలో కూడా కనిపించింది. 

ఇదిలా ఉండగా 'దస్వీ' సినిమా సమయంలో నిమ్రత్ కౌర్, అభిషేక్ బచ్చన్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇరువురు ఇంకా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు ఆమె తన కొత్త ప్రాజెక్ట్ 'సెక్షన్ 84' కోసం సిద్ధమవుతోంది. ఇది కోర్ట్ రూమ్ డ్రామా ఇందులో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కనిపించనున్నారు. రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.  

Read Also : Prabhas Birthday: ప్రభాస్ సన్ గ్లాసెస్ ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే... రాజా సాబ్ కాస్ట్లీ గురూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget