అన్వేషించండి

Surya Kiran: విడాకుల తర్వాత అలా చేశానని కళ్యాణి తిట్టింది, పెళ్లి పంజరంలాంటిది - సూర్య కిరణ్ ఓల్డ్ ఇంటర్వ్యూ వైరల్

Surya Kiran: నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ సోమవారం నాడు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన పాత ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి.

Director Surya Kiran About Ex Wife Kalyani: తెలుగు సినీ అభిమానులకు సూర్య కిరణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు కన్నుమూశారు. ఆయన మరణం పట్ల సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.  

బాల నటుడిగా 200 చిత్రాలు చేసిన సూర్య కిరణ్

సూర్య కిరణ్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత సహాయన నటుడిగా కనిపించాడు. తెలుగులో ‘సత్యం’ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో సుమంత్ హీరోగా నటించారు. ‘సత్యం’ అద్భుత విజయాన్ని అందుకోవడంతో అటు సుమంత్ కు, ఇటు సూర్య కిరణ్‌ కెరీర్‌‌‌లో మైల్ స్టోన్‌గా మిగిలిపోయింది. ‘సత్యం’ తర్వాత ‘ధన 51’, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజు భాయ్‌’, ‘చాప్టర్‌-6’ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బిగ్‌ బాస్‌ సీజన్‌-4 లోనూ కంటెస్టెంట్‌ గా హౌస్ లోకి అడుగు పెట్టారు.

కల్యాణితో ప్రేమ వివాహం, విడాకులు

టిఎస్‌.మణి, రాధా దంపతులకు సూర్య కిరణ్‌ జన్మించారు. చెన్నైలోనే పుట్టిన ఆయన అక్కడే పెరిగారు. వీళ్ల సొంతూరు  కేరళలోని తిరువనంతపురం. సూర్య కిరణ్‌ సోదరి సుజిత తమిళ, తెలుగు సినిమాలతో పాటు సీరియల్స్ లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా కొనసాగుతున్నారు. హీరోయిన్ కల్యాణిని సూర్య కిరణ్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య కిరణ్.. పెళ్లి గురించి, తన భార్య కల్యాణి గురించి కీలక విషయాలు చెప్పారు.

“విడాకుల తర్వాత తన గురించి మాట్లాడొద్దని కల్యాణి చెప్పారు. ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో తన గురించి చెప్పాను. ఆమె మా మేనేజర్ కు ఫోన్ చేసి తిట్టారు. మేం విడాకులు తీసుకున్నాం కదా.. మళ్లీ నా గురించి మాట్లాడ్డం ఎందుకు? అని అడిగారు. అందుకే నేను ఆమె గురించి మాట్లాడలేను. మాట్లాడ్డం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నిజానికి పెళ్లి అనేది పంజరంలో ఉన్న పావురం లాంటిది. బయట ఉన్న వాళ్లు ఎప్పుడు లోపలికి వెళ్దామా? అనిపిస్తుంది. లోపల ఉన్న వారికి ఎప్పుడు బయటకు పోదామా? అనిపిస్తుంది. ఒకవేళ పిల్లలు పుడితే, వాళ్ల కోసం అయినా కలిసి ఉండక తప్పదు. విడాకులు తీసుకున్న తర్వాత కల్యాణితో మాట్లాడలేదు. ఆమె కూడా నాతో మాట్లాడలేదు. ఎవరి దారిన వాళ్లం బతుకుతున్నాం” అని సూర్య కిరణ్ చెప్పుకొచ్చారు. 

Read Also: ‘ప్రేమలు’ బ్యూటీ ‘రెబల్’ ట్రైలర్ రివ్యూ : యాక్షన్‌ తో అదరగొట్టిన జీవీ ప్రకాష్, క్యూట్‌ నెస్‌ తో చంపేస్తున్న మమిత

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Embed widget