Abdul Kalam Biopic: ధనుష్‌ను మించిన గొప్ప నటులు లేరు - 'అబ్దుల్ కలాం' బయోపిక్‌పై డైరెక్టర్ ఓం రౌత్ రియాక్షన్
Dhanush: 'కలాం' బయోపిక్ చేసేందుకు ధనుష్ ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పారు. ఆయన గొప్ప నటుడని... ఆయనతో కలిసి వర్క్ చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Om Raut About Abdul Kalam Biopic Praises Dhanush: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లైఫ్ స్టోరీ ఆధారంగా 'కలాం' బయోపిక్ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో 'కలాం' టైటిల్ రోల్‌ను కోలీవుడ్ స్టార్ ధనుష్ పోషిస్తుండగా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడిన ఆయన... ధనుష్‌పై ప్రశంసలు కురిపించారు.
ఆయన కన్నా గొప్ప నటుడు ఎవరు?
ధనుష్ గొప్ప నటుడని ఆయనకన్నా మరో గొప్ప నటుడు లేరని ఓం రౌత్ అన్నారు. 'కలాం బయోపిక్‌లో నటించేందుకు ధనుష్ ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తితో ఉన్నాను. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇతర సినిమాలతో పోలిస్తే కలాం బయోపిక్ తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్నది. చిన్నప్పుడు నేను కలాం నా ఇన్‌స్పిరేషన్. ఆయన పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆయన గురించి వెండితెరపై చెప్పినప్పుడు మరెందరో ఇన్ స్పైర్ అవుతారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ మూవీ సినీ ప్రేక్షకులనే కాదు కలాంని అభిమానించే ప్రతి ఒక్కరికీ నచ్చేలా ప్రత్యేకమైన అనుభూతిని పంచేలా ఉంటుంది. ' అని స్పష్టం చేశారు.
Also Read: ఫస్ట్ టైం నీ బర్త్ డే మిస్ అవుతున్నా - మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్... SSMB29 షూటింగ్‌లో బిజీ బిజీ
ఇటీవల 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అఫీషియల్‌గా ఈ మూవీని అనౌన్స్ చేయడం సహా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. కలాం లుక్‌లో ధనుష్ అదరగొట్టారు. మూవీలో కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాల కోసం ఆయన చేసిన సేవలను సిల్వర్ స్క్రీన్‌పై చూపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టును పాన్ ఇండియా లెవల్‌లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బయోపిక్‌తోనే కెరీర్ ప్రారంభం
డైరెక్టర్ ఓం రౌత్ కెరీర్ బయోపిక్‌తోనే ప్రారంభం అయ్యింది. బాల గంగాధర్ తిలక్ లైఫ్ స్టోరీ ఆధారంగా 'లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్' మూవీతో ఆయన డైరెక్టర్‌గా మారారు. ఆ తర్వాత తానాజీ, ప్రభాస్‌తో 'ఆది పురుష్' తెరకెక్కించారు. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. తాజాగా కలాం బయోపిక్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతుండగా... త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఇక ధనుష్ విషయానికొస్తే రీసెంట్‌గా 'కుబేర' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో 'ఇడ్లీ కడై' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబరులోనే రిలీజ్ కానుంది. ఆ తర్వాతే 'కలాం' బయోపిక్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.





















