Nag Ashwin: ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ - వెయిట్ చేయక తప్పదా?... డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియాక్షన్ ఇదే
Kalki 2898 AD Sequel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీలక అప్డేట్ ఇచ్చారు. అందరూ బిజీగా ఉన్నారని... కొంత టైం పడుతుందని అన్నారు.

Director Nag Ashwin Drops Update On Prabhas Kalki 2898 AD Sequel: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ 'కల్కి 2898 AD' సీక్వెల్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD' గతేడాది జూన్ 27న రిలీజై వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే ఉంది.
నాగ్ అశ్విన్ రియాక్షన్
తాజాగా 'కల్కి' సీక్వెల్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ పాడ్ కాస్ట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. 'ఈ ఏడాది చివరి నాటికి కల్కి సీక్వెల్‌కు సంబంధించి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుంది. యాక్టర్స్ అందరూ కలిసి రావాలి. వారి డేట్స్ కుదరాలి. అందరూ బిజీగా ఉన్నారు. కొన్ని ప్రీ విజువలైజ్డ్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ చాలా పెద్దవి. కాబట్టి వీటికి కొంత టైం పడుతుంది. నా దగ్గర కచ్చితమైన ఆన్సర్ అయితే లేదు.' అని చెప్పారు.
షూటింగ్‌కు కొంత సమయం పడుతుందని... పోస్ట్ ప్రొడక్షన్‍కు ఎక్కువ టైం పడుతుందని నాగ్ అశ్విన్ తెలిపారు. 'ఇంకో 2 లేదా మూడేళ్లలో ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా.' అంటూ చెప్పడంతో ప్రభాస్‌ను కర్ణుడిగా సిల్వర్ స్క్రీన్‌పై చూడాలంటే చాలా టైం వేచి ఉండక తప్పేలా లేదు.
Also Read: సొంత కుటుంబానికి దూరంగా ఎన్టీఆర్... కానీ అల్లు - కొణిదెల కుటుంబాలు కలిశాయ్!
ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, శోభన, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించగా... డైరెక్టర్ నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్‌పై ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించారు. సైన్స్ ఫిక్షన్‌కు పౌరాణిక కథను జోడించి విజువల్ వండర్‌ను రూపొందించారు.
'కల్కి 2898 AD' మూవీ మొత్తం కల్పిత ప్రపంచంలోనే సాగుతుంది. కురుక్షేత్రం తర్వాత 6 వేల ఏళ్లకు ప్రారంభమయ్యే కథ. పురాణాల్లో చెప్పినట్లుగా భూమిపై తొలి నగరంగా కాశీ అప్పటికి చివరి నగరంగా మారుతుంది. కాశీ, కాంప్లెక్స్, అంబాలా అనే లోకాల్లో ఈ స్టోరీ నడుస్తుంది. కాంప్లెక్స్‌కు సుప్రీమ్‌గా ఉన్న యాస్కిన్... ఈ భూమిపై వనరులు అన్నీ పీల్చేసి స్వర్గంలాంటి కాంప్లెక్స్‌ను నిర్మించి పాలిస్తుంటాడు. విష్ణువు కల్కి అవతారం రాకుండా 'ప్రాజెక్ట్ K' చేపడతాడు యాస్కిన్. ఈ స్టోరీని ఓ విజువల్ వండర్‌లా అద్భుతంగా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు నాగ్ అశ్విన్.
ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్స్ పనులు పూర్తైనా ప్రభాస్ డేట్స్ కుదరక ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ 'ది రాజాసాబ్', 'ఫౌజీ' మూవీస్‌లో బిజీగా ఉన్నారు. దీంతో పాటే 'స్పిరిట్' కూడా లైనప్‌లో ఉంది. వీటి తర్వాత ప్రభాస్ 'కల్కి 2'లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.





















