Maruthi: మారుతి నెక్స్ట్ సినిమా ఎవరితో? మెగా రూమర్లకు 'రాజా సాబ్' దర్శకుడి చెక్!
Maruthi Next Movie After The Raja Saab: ప్రభాస్ 'ది రాజా సాబ్'తో పాన్ ఇండియా మార్కెట్టులో అడుగు పెట్టారు దర్శకుడు మారుతి. ఆ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమా ఇదేనంటూ వచ్చిన పుకార్లకు చెక్ పెట్టారు.

సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ 'ది రాజా సాబ్'తో పాన్ ఇండియా మార్కెట్టులో అడుగు పెట్టారు దర్శకుడు మారుతి (Director Maruthi). 'ఈ రోజుల్లో' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన... ఇవాళ పాన్ ఇండియా సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అయితే... సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఆశించిన విధంగా లేదు. కానీ, మారుతి రాసిన కథకు మంచి పేరు వచ్చింది. అదే సమయంలో విమర్శలూ వచ్చాయి. ఈ తరుణంలో మారుతి నెక్స్ట్ సినిమా మీద అందరి చూపు నెలకొంది. ఓ సినిమా ఓకే అయ్యిందంటూ ప్రచారం జరిగింది. దానికి మారుతి చెక్ పెట్టారు.
మారుతి మెగా సినిమా రూమర్లకు చెక్!
మెగా కుటుంబంతో, ముఖ్యంగా గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థతో మారుతికి మంచి అనుబంధం ఉంది. అల్లు శిరీష్, సాయి దుర్గా తేజ్ హీరోలుగా 'కొత్త జంట', 'ప్రతి రోజూ పండగే' సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. పైగా, మెగా అభిమాని కూడా!
Also Read: Allari Naresh: అల్లరి నరేష్ ఇంట విషాదం... ఈవీవీ తండ్రి, నరేష్ తాతయ్య మృతి
'ది రాజా సాబ్' రిలీజ్ తర్వాత చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయడానికి మారుతి సన్నాహాలు చేస్తున్నారని బలంగా ప్రచారం జరిగింది. చిరు - మారుతి సినిమా ఇప్పటిది కాదు. సినిమాల్లోకి చిరంజీవి రీ ఎంట్రీ నుంచి చర్చల్లో ఉంది. మెగాస్టార్ కామెడీ టైమింగ్, ఆయన ఇమేజ్ తెలిసిన అభిమాని మారుతి. అయితే చాలా రోజుల నుంచి కథ కుదరడం లేదు. 'ది రాజా సాబ్' తర్వాత మరోసారి మెగాస్టార్ - మారుతి సినిమా న్యూస్ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది. ఆ రూమర్లకు మారుతి టీమ్ చెక్ పెట్టింది.
Also Read: Bheems Bollywood Debut: బాలీవుడ్ వెళుతున్న భీమ్స్... అక్షయ్ కుమార్ సినిమాకు సంగీత దర్శకుడిగా
మారుతి నెక్స్ట్ సినిమా గురించి ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని, అవి పూర్తిగా నిరాధారమైనవి అని, ఆయన నెక్స్ట్ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ నిర్మాణ సంస్థలు అధికారికంగా అనౌన్స్ చేస్తాయని మారుతి టీం పేర్కొంది.
The news currently circulating about Director #Maruthi’s next project is completely baseless and misleading.
— Suresh PRO (@SureshPRO_) January 20, 2026
An official announcement about his next project will be made through authorized channels. pic.twitter.com/yXGNFb2u4I
'ది రాజా సాబ్' సీక్వెల్ 'రాజా సాబ్ సర్కస్ 1935' అనౌన్స్ చేశారు. దానితో పాటు 'భలే భలే మగాడివోయ్ 2' స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారు మారుతి. ఆ రెండిటిలో ఏదైనా ముందు ఉంటుందా? లేదంటే మరొక సినిమా పట్టాలు ఎక్కుతుందా? అనేది చూడాలి.





















