Director Jayashankarr Interview: ఏఐతో 'అరి' విఎఫ్ఎక్స్ చేశాం... జాక్వెలిన్‌తో నెక్స్ట్ సినిమా - 'అరి' దర్శకుడు జయశంకర్ ఇంటర్వ్యూ
డైలాగ్ కింగ్ సాయికుమార్, అనసూయ వినోద్ వర్మ కీలక పాత్రల్లో పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన సినిమా 'అరి'. ఈ శుక్రవారం విడుదల. ఈ సందర్భంగా సినిమా గురించి దర్శకుడు చెప్పిన ముచ్చట్లు...

''చిన్నతనం నుంచి నాకు పురాణాలు ఇతిహాసాలు అంటే ఆసక్తి. అదే నన్ను ఈ సినిమా చేయడానికి ప్రేరేపించింది. అరిషడ్వర్గాలను జయించాలని పురాణాల్లో చెప్పారు తప్ప వాటిని ఎలా జయించాలో ఎక్కడా చెప్పలేదు. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలవడంతో పాటు ఇక్కడ పలు ఆశ్రమాలు తిరిగి స్వామీజీలతో చర్చించిన తర్వాత అరిషడ్వర్గాలను జయించేందుకు మార్గాలు తెలుసుకున్నాను. వాటి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను'' అని దర్శకుడు జయశంకర్ చెప్పారు.
స్టార్ యాంకర్, యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఓ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'అరి' (Ari My Name Is Nobody Movie). ఇందులో వినోద్ వర్మ హీరో. డైలాగ్ కింగ్ సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష చెముడు ఇతర కీలక తారాగణం. 'పేపర్ బాయ్' తర్వాత జయశంకర్ (Director Jayashankarr) దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ శుక్రవారం (అక్టోబర్ 10న) విడుదల. ఈ సందర్భంగా దర్శకుడు చెప్పిన విశేషాలు...
- పురాణ, ఇతిహాసాలు అరిషడ్వర్గాలు అంటే ప్రేక్షకులకు అర్థం కాని రీతిలో ఉంటుందని అనుకోవద్దు. సాధారణ ప్రేక్షకులకు సైతం సులభంగా అర్థమయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. అందువల్లే కొంత ఆలస్యం అయ్యింది. దర్శకత్వం మీద ఆసక్తితో మంచి ఉద్యోగం వదులుకొని 2014లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. నేను వచ్చిన నాలుగేళ్లకు నా మొదటి సినిమా 'పేపర్ బాయ్'కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో దర్శకుడిని అయ్యానని కొందరు అన్నారు అయితే రెండో సినిమా చేయడానికి కొంత గ్యాప్ వచ్చింది. మధ్యలో కరోనా రావడం వల్ల రెండు పెద్ద నిర్మాణ సంస్థల్లో అవకాశాలు వచ్చిన మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటానని ఆశిస్తున్నా.
- స్టార్ హీరోలు సైతం చేసే సత్తా ఉన్న కథ ఇది. అయితే వాళ్ల చేస్తే క్యారెక్టర్స్ కంటే స్టార్‌డమ్ డామినేట్ చేస్తుందని పాత్రలకు సరిపోయే నటీనటులను తీసుకున్నాను. అలాగని చిన్నవాళ్ల దగ్గరకు వెళ్లలేదు. క్యారెక్టర్ కనిపించేలా నటించే ట్యాలెంటెడ్ ఆరిస్టులు సాయి కుమార్, అనసూయ మా సినిమాలో చేశారు. సినిమాలోని ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకులకు గుర్తుంటుంది సందేశం ఇవ్వాలని ఈ సినిమా తీయలేదు. ఉపేంద్ర గారి తరహాలో ఒక సందేశం ఉంటూ కమర్షియల్ పంథాలో సినిమా ఉండాలని తీశా. ఇటువంటి కథతో ఇప్పటివరకు సినిమా రాలేదని బలంగా చెప్పగలను.
Also Read: కళ్యాణీ ప్రియదర్శన్ గ్లామర్ ట్రీట్... బెల్లీ డ్యాన్స్‌తో షేక్ ఆడించిందంతే
- అరిషడ్వర్గాల మీద కథ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది. తక్కువ నిర్మాణ వ్యయంలో క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ చేశామని అనుకుంటున్నా. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కొంత విఎఫ్ఎక్స్ చేశాం. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో పాటు మల్లాది, యండమూరి వంటి రచయితలు సినిమా చూసి అభినందించారు. వెంకయ్య గారు అయితే మోడరన్ భగవద్గీతలా ఉదని చెప్పారు. బాలీవుడ్ హీరో ఒకరు, కన్నడ స్టార్ ఒకరు సినిమా చూశారు. అన్నీ కుదిరితే అక్కడ రీమేక్ చేసే అవకాశం ఉంది.
- యువతకు సైతం నచ్చే విధంగా 'అరి' తీశానని అనుకుంటున్నా. ప్రీ క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ప్రేక్షకులు చూస్తారు. పతాక సన్నివేశాలు 20 నిమిషాలు అద్భుతంగా వచ్చాయి. జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రలో మరో సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ మొదలు అవుతుంది.






















