Manjummel Boys: అది బురద కాదు.. ఓరియో బిస్కెట్లు - ‘మంజుమ్మెల్ బాయ్స్’లో సుభాష్ మేకప్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్
Manjummel Boys: చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’.. ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్లైమాక్స్‌లో శ్రీనాథ్ బసీ మేకప్ గురించి తాజాగా ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు ఈ డైరెక్టర్.
![Manjummel Boys: అది బురద కాదు.. ఓరియో బిస్కెట్లు - ‘మంజుమ్మెల్ బాయ్స్’లో సుభాష్ మేకప్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్ Director Chidambaram reveals about Sreenath Basi makeup trick in Manjummel Boys Manjummel Boys: అది బురద కాదు.. ఓరియో బిస్కెట్లు - ‘మంజుమ్మెల్ బాయ్స్’లో సుభాష్ మేకప్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/19/fe0fb5c0e4d7279fab503c7cb0d0ec401710838880187574_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manjummel Boys: మలయాళ సినిమాలు థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంటున్న సమయంలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే మూవీ క్రియేట్ చేసి సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఏ మలయాళం సినిమా క్రియేట్ చేయని రికార్డులను ‘మంజుమ్మెల్ బాయ్స్’ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓ రేంజ్‌లో హిట్ అయిన తర్వాత కూడా మూవీ టీమ్ ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొంటోంది. ఈ సినిమాను చేయడం కోసం వారంతా ఎంత కష్టపడ్డారో చెప్తుంటే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మూవీ గురించి మరో ఆసక్తికర విషయం పంచుకున్నారు మేకర్స్.
అది బురద కాదు..
‘మంజుమ్మెల్ బాయ్స్’ కథ విషయానికొస్తే.. కేరళలో మంజుమ్మెల్ బాయ్స్ అని పిలవబడే ఒక టీమ్ అంతా కలిసి తమిళనాడుకు ట్రిప్‌కు వెళ్తుంది. అక్కడ గుణ కేవ్స్ ఫేమస్ అని తెలిసి అక్కడికి వెళ్తారు. గుహను చూస్తున్న సమయంలో ఆ టీమ్‌లోని ఒక వ్యక్తి అయిన సుభాష్.. ఒక లోయలో పడిపోతాడు. ఆ తర్వాత సుభాష్‌ను తన ఫ్రెండ్స్ అంతా ఎలా కాపాడారు అనేదే కథ. ‘మంజుమ్మెల్ బాయ్స్’ కోసం గుణ కేవ్ లాంటి సెట్ వేయడానికి ఎంత కష్టపడ్డారో తాజాగా మూవీ టీమ్ బయటపెట్టారు. అంతే కాకుండా సుభాష్ క్యారెక్టర్ లోయలో పడిపోయినప్పుడు తన ఒంటికి పూర్తిగా మట్టి, బురద అంటుకొని ఉంటుంది. అదంతా చాలా నేచురల్‌గా ఉందని ప్రేక్షకులు ప్రశంసించగా.. తాజాగా ఆ మేకప్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టింది మూవీ టీమ్.
చీమలు కుట్టేవి..
సుభాష్ క్యారెక్టర్‌కు చేసిన మేకప్ గురించి దర్శకుడు చిదంబరం ప్రత్యేకంగా మాట్లాడాడు. అతని ఒంటిపై కనిపించిన మట్టి, బురదను ఓరియో బిస్కెట్లతో చేశామని బయటపెట్టాడు. దాని వల్ల సుభాష్ క్యారెక్టర్ చేసిన శ్రీనాథ్ బాసీకి అసౌకర్యంగా అనిపించినా కూడా తను చాలా డెడికేషన్‌తో క్లైమాక్స్‌ను పూర్తిచేశాడని అన్నారు. బిస్కెట్లను మేకప్‌గా ఉపయోగించడంతో చీమలు వచ్చి శ్రీనాథ్‌ను కుట్టేవని చిదంబరం చెప్పుకొచ్చాడు. అలా సినిమాలో నేచురల్‌గా కనిపించడం కోసం మరెన్నో ట్రిక్స్ ఉపయోగించామని అన్నాడు చిదంబరం. ‘మంజుమ్మెల్ బాయ్స్’ కోసం సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అయిన రోనెక్స్ జేవియర్‌ను రంగంలోకి దించారని తెలిపాడు.
నిజమైన సంఘటన ఆధారంగా..
2006లో నిజంగానే గుణ కేవ్స్‌లో జరిగిన ఒక కథ ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ తెరకెక్కింది. గుణ కేవ్స్‌లోని లోయలో పడి ఇప్పటికీ చాలామంది మరణించగా.. తమ ఫ్రెండ్ సుభాష్ మాత్రం అలా చనిపోకూడదు అనే ఉద్దేశ్యంతో తన ఫ్రెండ్స్ అంతా కలిసి చేసిన సాహసాన్ని ఈ సినిమాలో బాగా చూపించాడు చిదంబరం. ‘మంజుమ్మెల్ బాయ్స్’లో శోభున్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ పరంబోల్ లీడ్ రోల్స్‌లో నటించారు. నటులు ఎక్కువమంది ఉన్నా కూడా వారందరికీ సమానంగా ప్రాధాన్యత ఇస్తూ సినిమాను నడిపించిన తీరు బాగుందంటూ ప్రేక్షకులు చిదంబరంపై ప్రశంసలు కురిపించారు.
Also Read: 'మైదాన్' డిజాస్టర్‌పై స్పందించిన బోనీ కపూర్ - ఆర్‌ఆర్‌ఆర్, పఠాన్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)