Dharmendra Pension: ధర్మేంద్ర ఆస్తిలో హక్కు గానీ, ఆయన పెన్షన్ గానీ హేమా మాలినికి రాదు - ఎందుకంటే?
Dharmendra Hema Malini News: ధర్మేంద్ర మరణించారు. ఇప్పుడు ఆయన ఆస్తికి అసలైన వారసులు ఎవరు? అనే చర్చ మొదలైంది. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే... ధర్మేంద్ర ఆస్తి, పెన్షన్ లో హేమమాలినికి హక్కులు లేవట.

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం (Dharmendra Deol Death)తో ఆయన కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. నవంబర్ 24న ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధర్మేంద్ర భార్య హేమా మాలిని తెలుపు రంగు దుస్తుల్లో కనిపించారు. ఆవిడ వీడియో వైరల్ అవుతోంది. ధర్మేంద్ర తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు.
ధర్మేంద్ర రెండు పెళ్లిళ్లు
నిజం చెప్పాలంటే... ధర్మేంద్ర రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య పేరు ప్రకాష్ కౌర్, రెండవ భార్య డ్రీమ్ గాళ్ హేమా మాలిని. ఆయన మరణించిన నేపథ్యంలో ధర్మేంద్ర ఆస్తి, పెన్షన్ లో హేమా మాలినికి వాటా వస్తుందా? లేదా? అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి.
ధర్మేంద్ర ఆస్తి, పెన్షన్ లో హేమా మాలినికి వాటా రాదని భారతీయ న్యాయ శాస్త్రం, చట్టం చెబుతోంది. వాస్తవానికి ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ నుండి విడాకులు తీసుకోకుండానే హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం... మొదటి భార్య ఉండగా హేమా మాలిని, ధర్మేంద్రల వివాహం చెల్లదు. అందుకే హేమా మాలినికి ధర్మేంద్ర ఆస్తిలో ఎలాంటి వాటా రాదు. అంతే కాకుండా, హేమా మాలినికి పెన్షన్ లో కూడా ఎలాంటి హక్కు లేదు.
Also Read: బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
View this post on Instagram
ధర్మేంద్ర ఆస్తిలో ఎవరికి హక్కు ఉందంటే?
ధర్మేంద్ర ఆస్తిలో ఆయన మొదటి భార్య ప్రకాష్ కౌర్, అలాగే ధర్మేంద్ర ఆరుగురు పిల్లలకు హక్కు ఉంది. ఆయన ఆరుగురి పిల్లల్లో నలుగురు పిల్లలు సన్నీ డియోల్, బాబీ డియోల్, అజీతా డియోల్, విజేతా డియోల్ మొదటి భార్య ప్రకాష్ కౌర్ సంతానం కాగా... ఇషా డియోల్, అహానా డియోల్ - ఇద్దరు పిల్లలు హేమా మాలినికి ఉన్నారు.
ధర్మేంద్ర పెళ్లిళ్లు ఎప్పుడు జరిగాయి?
ధర్మేంద్ర 1954లో ప్రకాష్ కౌర్ ను మొదటి వివాహం చేసుకున్నారు. అప్పుడు ధర్మేంద్ర వయసు 19 సంవత్సరాలు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అదేవిధంగా, హేమాతో ధర్మేంద్ర వివాహం మే 2, 1980న జరిగింది. ప్రకాష్ కౌర్ ధర్మేంద్రకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు ధర్మేంద్ర మతం మార్చుకుని హేమాను పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, హేమాను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ తోనే ఉన్నారు.





















