Dhanush: చిన్నప్పుడు డైలీ ఇడ్లీ తినాలనిపించేది... డబ్బుల్లేవ్ - కోలీవుడ్ స్టార్ ధనుష్ ఎమోషనల్
Idli Kottu Movie: తాను చిన్నప్పుడు కష్టపడి సంపాదించి కొనుక్కున్న ఇడ్లీల టేస్ట్ ఇప్పుడు లగ్జరీ రెస్టారెంట్లలో లేదని హీరో ధనుష్ అన్నారు. 'ఇడ్లీ కడై' ఈవెంట్‌లో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

Dhanush Emotional Speech In Idly Kottu Movie: తనకు చిన్నప్పుడు ప్రతీ రోజూ ఇడ్లీ తినాలనిపించేదని కానీ అప్పట్లో డబ్బులుండేవి కాదని కోలీవుడ్ స్టార్ ధనుష్ అన్నారు. రీసెంట్‌గా 'కుబేర'తో హిట్ కొట్టిన ఆయన స్వీయ దర్శకత్వంలో 'ఇడ్లీ కడై' మూవీతో రానున్నారు. తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో అక్టోబర్ 1న రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు ధనుష్.
2 రూపాయలకు నాలుగైదు ఇడ్లీలు
చిన్నప్పుడు రోజూ ఇడ్లీ తినాలనిపించేదని... అయితే కొనేందుకు తన దగ్గర డబ్బులుండేవి కాదని ధనుష్ చెప్పారు. 'డబ్బుల కోసం దగ్గరలో ఉన్న తోటలో పువ్వులు తెంపడానికి వెళ్లే వాడిని. ఉదయం 4 గంటలకు నిద్ర లేచి తోటకు వెళ్లి 2 గంటలు వర్క్ చేస్తే రూ.2 ఇచ్చేవారు. అది తీసుకుని రోడ్డు పంపు దగ్గరకు వెళ్లి అక్కడే స్నానం చేసేవాళ్లం. ఆ తర్వాత ఇడ్లీ కొట్టుకు వెళ్తే నాలుగైదు ఇడ్లీలు ఇచ్చేవారు. అవి తింటే వచ్చే ఆనందమే వేరు. మనం కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న ఇడ్లీలు తింటే ఆ కిక్కే వేరు.
అప్పుడు నేను కొనుక్కుని తిన్న ఇడ్లీ రుచి ఇప్పుడు లగ్జరీ రెస్టారెంట్లలోనూ ఉండడం లేదు. అప్పుడు తిన్న ఆనందం కూడా ఇప్పుడు కలగడం లేదు. ఇటీవల నేను చాలా మంది ఫ్యాన్స్‌ను కలిశాను. వారిలో చాలామంది ఇంజినీర్లు, లాయర్లు, డాక్టర్లుగా ఉన్నారు. నా ఫ్యాన్స్ గొప్ప స్థాయిలో ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ జీవితాన్ని నిలబెట్టుకునే దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.' అని సూచించారు.
Also Read: మహేష్ 'SSMB29' బిగ్గెస్ట్ అడ్వెంచర్ కోసం బిగ్ సెట్... హైదరాబాద్‌లో ఫేమస్ టెంపుల్ క్రియేట్ చేస్తారా?
రియల్ లైఫ్ ఆధారంగా...
'ఇడ్లీ కొట్టు' మూవీ రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని... అందరికీ ఇన్‌స్పిరేషన్‌లా ఉంటుందని చెప్పారు ధనుష్. అలాగే, ట్రోల్ చేసే వారిపైనా రియాక్ట్ అయ్యారు. 'అసలు హేటర్స్ అనే కాన్సెప్టే లేదు. హీరోలందరి సినిమాలను కూడా అందరూ చూస్తారు. ఎవరో ఒక 30 మంది టీంగా ఏర్పడి 300 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని... వారి మనుగడ కోసం హీరోలపై సోషల్ మీడియాలో కావాలనే ద్వేషం వ్యక్తం చేస్తున్నారు. ఆ 30 మంది కూడా సినిమా చూస్తారు. బయట ఉండే దానికి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది.' అంటూ చెప్పారు. త్వరలోనే వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడ చెన్నై' సీక్వెల్‌లో నటించనున్నట్లు ప్రకటించారు.
ఇక 'ఇడ్లీ కడై' విషయానికొస్తే... తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా డబ్ చేయగా వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 1నే తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కానుంది. ధనుష్ సరసన నిత్యా మేనన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. వీరితో పాటే సత్యరాజ్, షాలినీ పాండే, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మించారు.






















