Dhanush Viral Video: ఫ్రీగా సాంగ్ చేసి పెడితే పది కోట్లు అడుగుతావా? ధనుష్‌పై నయనతార ఫ్యాన్స్ ఫైర్
When dhanush calls Nayanthara as friend: ధనుష్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేడీ సూపర్ స్టార్ నయనతార ఓపెన్ లెటర్ రాసిన నేపథ్యంలో ఓల్డ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ధనుష్ (Dhanush) మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయనతార (Nayanthara) సోషల్ మీడియాలో ఓ లేక విడుదల చేసిన నేపథ్యంలో... నయనతారను పొగుడుతూ, ఆమె తన స్నేహితురాలు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...
ధనుష్ కోసం ఫ్రీగా సౌంగ్ చేసిన నయన్!
నయనతార, ధనుష్ మధ్య వివాదానికి కారణమైన 'నేను రౌడీనే' సినిమా 2015లో విడుదల అయ్యింది. దానికి ముందే వాళ్ళిద్దరూ కలిసి పని చేశారు. వెంకటేష్, త్రిష జంటగా నటించిన 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమా గుర్తు ఉంది కదా! ధనుష్, నయనతార జంటగా ఆ సినిమా తమిళ్ వెర్షన్ 'యారాది నీ మోహిని'లో యాక్ట్ చేశారు. అది 2008లో వచ్చింది.
శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఓ తమిళ సినిమా 'ఎథిర్ నీచల్' (Ethir Neechal). దానిని ధనుష్ ప్రొడ్యూస్ చేశారు. అందులో ఓ పాటలో నయనతార తళుక్కున మెరిశారు. అతిథిగా సందడి చేశారు. ఆ పాటలో ధనుష్ కూడా కాసేపు సందడి చేశారు. ఆ పాట చేసినందుకు నయనతార రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ విషయం ధనుష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
View this post on Instagram
నయనతార, సమంత... ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమని అడిగితే? నయనతార పేరు చెప్పారు ధనుష్, శివ కార్తికేయన్. తమ సినిమాలో పాట చేసినందుకు నయన్ డబ్బులు తీసుకోలేదని, ఆమె తన ఫ్రెండ్ అని, ఫ్రీగా సాంగ్ చేసిందని చెప్పారు ధనుష్. లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆ వీడియో వైరల్ చేస్తున్నారు. అప్పట్లో నయన్ స్టార్ స్టేటస్ దృష్టిలో పెట్టుకుంటే రెండు మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేదని, కానీ ఆవిడ ఫ్రీగా చేశారని, ఇప్పుడు ధనుష్ పది కోట్లకు అడగటం దారుణం అని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
Also Read: బికినీలో దిశా పటానీ - 'కంగువ'లో బోల్డ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన లేడీ... ఆ ఫోటోలు చూశారా?
స్నేహితుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది?
ధనుష్ కోసం నయనతార ఫ్రీగా స్పెషల్ సౌంగ్ చేసినప్పుడు... ఆమె కోసం 'నేను రౌడీనే' సినిమాలో పాటను వాడుకోవడానికి ధనుష్ ఎందుకు అభ్యంతరం చెప్పారు? మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎందుకు లీగల్ నోటిస్ పంపించారు? ధనుష్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయనతార ఎందుకు లెటర్ విడుదల చేశారు? తండ్రి, అన్నయ్య మద్దతుతో ధనుష్ ఎస్టాబ్లిష్ అయ్యారని, ఇతరుల బాధను చూసి ధనుష్ ఆనందిస్తారని తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేశారు? అనేది ఇప్పుడు కోలీవుడ్ వర్గాలలో చర్చనీయాంశం అవుతోంది. నయనతార ఆరోపణల పట్ల ధనుష్ ఏ విధంగా స్పందిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.