Dhanush Fights With Ryan Gosling: హాలీవుడ్ స్టార్స్‌ను చితకొడుతున్న ధనుష్ - విలన్‌గా రఫ్ఫాడిస్తాడా?
హాలీవుడ్ సినిమా 'ది గ్రే మ్యాన్'లో ధనుష్ నటించిన సంగతి తెలిసిందే. లేటెస్టుగా ఆయన యాక్షన్ సీన్స్ చేస్తున్న వీడియో విడుదల చేశారు.
హాలీవుడ్ సినిమా 'ది గ్రే మ్యాన్' (The Gray Man Movie)లో ధనుష్ (Dhanush) కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆయన రోల్ ఏంటనేది రివీల్ చేయలేదు. కానీ, లేటెస్టుగా విడుదల చేసిన ప్రోమో చూస్తే... ధనుష్ విలన్ రోల్ చేసినట్టు అర్థం అవుతోంది.
ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling) హీరోగా గా రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన చిత్రమే 'ది గ్రే మ్యాన్'. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్ కీలక పాత్రల్లో పోషించారు. ఈ రోజు ఒక యాక్షన్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. అందులో ర్యాన్ గోస్లింగ్, అనా డి ఆర్మాస్‌తో ఫైట్ చేస్తూ ధనుష్ కనిపించారు. హాలీవుడ్ స్టార్స్‌ను చితకొట్టారు. ధనుష్ ఫైటింగ్ స్కిల్స్ గురించి హాలీవుడ్ స్టార్స్ గొప్పగా చెబుతున్నారు.
Also Read : హాలీవుడ్ దర్శకులను ముంబై తీసుకు వస్తున్న ధనుష్
జూలై 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'ది గ్రే మ్యాన్' స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లిష్ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులో ఉంటుంది. భారతీయ ప్రేక్షకుల కోసం, ధనుష్ కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. ముంబైలో 'ది గ్రే మ్యాన్' స్పెషల్ ప్రీమియర్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి రూసో బ్రదర్స్ అటెంట్ కానున్నారు.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
View this post on Instagram