The Gray Man Movie: హాలీవుడ్ దర్శకులను ముంబై తీసుకు వస్తున్న ధనుష్
Russo Brothers Coming to Mumbai For Dhanush And The Gray Man Show: ప్రముఖ హాలీవుడ్ దర్శకులు, రూసో బ్రదర్స్‌ను ధనుష్ ముంబై తీసుకు వస్తున్నారు. 'ది గ్రే మ్యాన్' స్పెషల్ షో వేస్తున్నారు.
ధనుష్... పాన్ ఇండియా హీరో కాదు, పాన్ వరల్డ్ యాక్టర్ అని చెప్పాలి. కేవలం తమిళ సినిమాలకు మాత్రమే ఆయన పరిమితం కాలేదు. హిందీలో సినిమాలు చేస్తున్నారు. హాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా 'సర్' చేస్తున్నారు. ఒక భాషకు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అందరివాడు అనిపించుకుంటున్న ధనుష్... త్వరలో ప్రముఖ హాలీవుడ్ దర్శకులు, రూసో బ్రదర్స్‌ను ఇండియా తీసుకు వస్తున్నారు.
ర్యాన్ గోస్లింగ్ కథానాయకుడిగా రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా 'ది గ్రే మ్యాన్' (The Gray Man Telugu Movie). క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో పోషించారు. జూలై 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లిష్ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులో ఉంటుంది. భారతీయ ప్రేక్షకుల కోసం, ధనుష్ కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు.
The Gray Man Special Show In Mumbai: ముంబైలో 'ది గ్రే మ్యాన్' స్పెషల్ ప్రీమియర్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి రూసో బ్రదర్స్ అటెంట్ కానున్నారు. ఈ సందర్భంగా ''హాయ్! మేం రూపొందించిన కొత్త సినిమా 'ది గ్రే మ్యాన్' ప్రదర్శనకు, మా స్నేహితుడు ధనుష్ ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం'' అని రూసో బ్రదర్స్ ఒక వీడియో విడుదల చేశారు.
Also Read : జీవితం కంటే సినిమాలే ముఖ్యం - గాయాలను లెక్క చేయని రామ్
'ది గ్రే మ్యాన్' గురించి ధనుష్ మాట్లాడుతూ ''ఈ సినిమా జర్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఇందులో యాక్షన్, డ్రామా, ఓ పెద్ద చేజ్... అన్నీ ఉన్నాయి. నేను ఒక మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది'' అని అన్నారు.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
View this post on Instagram