![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Devaki Nandana Vasudeva Trailer: మహేష్ మేనల్లుడి యాక్షన్ అవతార్... ‘దేవకీ నందన వాసుదేవ’లో అదరగొట్టిన అశోక్ గల్లా - ట్రైలర్ చూశారా?
Ashok Galla: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.
![Devaki Nandana Vasudeva Trailer: మహేష్ మేనల్లుడి యాక్షన్ అవతార్... ‘దేవకీ నందన వాసుదేవ’లో అదరగొట్టిన అశోక్ గల్లా - ట్రైలర్ చూశారా? Devaki Nandana Vasudeva Trailer Mahesh Babu nephew Ashok Galla impresses in action packed avatar Devaki Nandana Vasudeva Trailer: మహేష్ మేనల్లుడి యాక్షన్ అవతార్... ‘దేవకీ నందన వాసుదేవ’లో అదరగొట్టిన అశోక్ గల్లా - ట్రైలర్ చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/12/55d0c28d02a45f8efe40d1de76892f641731393637503544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Devaki Nandana Vasudeva Trailer: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకులో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తి యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. అశోక్ గల్లా సరసన వారణాసి మానస హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
ఆకట్టుకుంటున్న ‘దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్
‘దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నది. ట్రైలర్ చూస్తుంటే... మూవీ దైవ కోణం ఉన్న కుటుంబ కథగా తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది. శ్రీకృష్ణుడి పుట్టుక మేనమామ కౌంసుడి మరణానికి కారణం అయినట్లు, ఈ సినిమాలో హీరో పుట్టుక అతడి మేనమామకు ప్రాణ గండం కానుంది. ఇంతకీ మేనల్లుడు, మేనమామ మధ్య వివాదం ఎక్కడ మొదల అవుతుంది? చివరికి కౌంసుడి మాదిరిగానే ఆయన చనిపోతాడా? అనే కథతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. అదిరిపోయే కథకు తోడు యాక్షన్ అవతారంలో అశోక్ గల్లా ఆకట్టుకుంటున్నాడు. కంప్లీట్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్ లో దుమ్మురేపాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, అర్జున్ జంధ్యాల దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లనున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాతో అశోక్ మాంచి హిట్ కొట్టే అవకాశం ఉన్నట్ల సినీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఈ నెల 14 నుంచి 22కు వాయిదా
వాస్తవానికి ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఈ సినిమా రిలీజ్ ను వారం పాటు వాయిదా వేశారు. ఈనెల 22వ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. విశ్వక్సేన్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో పాటు సత్యదేవ్ సినిమా ‘జీబ్రా’తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. ఈ సినిమాను లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నల్లపనేని నల్లపనేని యామిని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని శంకర్ పిక్చర్స్ ఇప్పటికే సొంతం చేసుకుంది. గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అయితే, తొలి చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. చాలా గ్యాప్ తీసుకుని ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ మీద ఆయన బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)