'డీమాంటీ కాలనీ 3' సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇది హారర్ థ్రిల్లర్ సిరీస్‌లో మూడవ భాగం.
Demonte Colony 3: కోలీవుడ్ ఆడియన్స్‌ను వణికించిన హారర్ థ్రిల్లర్... రిలీజుకు మూడో పార్ట్ రెడీ
Demonte Colony 3 Release Date: కోలీవుడ్ ప్రేక్షకులను 'డీమాంటీ కాలనీ' ఫస్ట్, సెకండ్ సినిమాలు భయపెట్టాయి. బాక్సాఫీస్‌లో విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో పార్ట్ రిలీజుకు రెడీ అయ్యింది.

- ‘డీమాంటీ కాలనీ 3’ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
- అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ నటించారు.
- సూపర్ హిట్ ‘డిమాంటీ కాలనీ’ హారర్ ఫ్రాంచైజీలో ఇది మూడవ భాగం.
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలు లేవు. హారర్ థ్రిల్లర్ సినిమాలకు అన్ని భాషల్లోనూ ఆదరణ దక్కుతోంది. తమిళ ప్రేక్షకులను భయపెట్టిన హారర్ థ్రిల్లర్ సినిమాల్లో 'డీమాంటీ కాలనీ' (Demonte Colony) ఒకటి. ఫస్ట్, సెకండ్ సినిమాలు ప్రేక్షకులకు మాంచి హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చి విజయాలు సాధించాయి. మరీ ముఖ్యంగా 'డీమాంటీ కాలనీ 2'కు తెలుగు రివ్యూలు బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమా విడుదలకు సిద్ధమైంది.
సెప్టెంబర్ నెలలో 'డీమాంటీ కాలనీ 3'
Arulnithi's Demonte Colony 3 Release Date: అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ సిరీస్ 'డిమాంటీ కాలనీ'లో మూడో పార్ట్ తెరకెక్కింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
'డీమాంటీ కాలనీ 3'లో అరుల్ నిధి సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. విక్రమ్ 'కోబ్రా' వంటి భారీ సినిమాను అజయ్ జ్ఞానముత్తు తీశారు. ఈ ఫ్రాంచైజీలోని మొదటి రెండు భాగాలకు కూడా ఆయనే దర్శకుడు. మూడవ భాగం 'డిమాంటీ కాలనీ 3'కి 'ది ఎండ్ ఈజ్ టూ ఫార్...' (The End Is Too Far) క్యాప్షన్ ఇచ్చారు.
Also Read: Ram Charan - మల్టీప్లెక్స్‌లకు రామ్ చరణ్ షాక్... థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు
View this post on Instagram
'డిమాంటీ కాలనీ' 2015లో విడుదలైంది. అది బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2024లో 'డిమాంటీ కాలనీ 2: వెంజెన్స్ ఆఫ్ ది అన్ హోలీ' విడుదలైంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... నలుగురు స్నేహితులు ఒక పాడుబడ్డ భవంతిలోకి వెళ్లడం, అక్కడ ఓ నెక్లెస్ వల్ల భయంకరమైన పరిణామాలు ఎదురు కావడం చుట్టూ సినిమా తిరుగుతుంది. హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Frequently Asked Questions
'డీమాంటీ కాలనీ 3' ఎప్పుడు విడుదలవుతుంది?
'డీమాంటీ కాలనీ 3' సినిమాకు దర్శకుడు ఎవరు, ప్రధాన నటీనటులు ఎవరు?
అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అరుళ్ నిధి కథానాయకుడిగా, ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించారు.
'డీమాంటీ కాలనీ' సిరీస్‌లోని మునుపటి భాగాలు విజయవంతమయ్యాయా?
అవును, మొదటి రెండు భాగాలు ప్రేక్షకులకు మంచి హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చి విజయాలు సాధించాయి. ముఖ్యంగా 'డీమాంటీ కాలనీ 2'కు మంచి రివ్యూలు వచ్చాయి.
'డీమాంటీ కాలనీ' సిరీస్ కథా నేపథ్యం ఏమిటి?
ఈ సిరీస్‌లోని సినిమాలు భయానక కథాంశంతో రూపొందాయి. పాడుబడ్డ భవంతిలోకి వెళ్ళిన నలుగురు స్నేహితులు నెక్లెస్ వల్ల భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవడం ప్రధానాంశం.
ట్రెండింగ్ వార్తలు





















