అన్వేషించండి

Deepika Padukone : ఎయిర్ పోర్టులో దీపికా, రణవీర్ కపుల్ - భార్యపై ఫుల్ కేరింగ్... నెటిజన్లు ఫిదా

Deepika Padukone Look : రెండోసారి పేరెంట్స్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసిన తర్వాత బాలీవుడ్ స్టార్స్ దీపికా, రణవీర్ కపుల్ బహిరంగంగా ఫస్ట్ టైం కనిపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Deepika Padukone Spotted At Mumbai Airport With Baby Bump : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone), రణవీర్ సింగ్ (Ranveer singh) దంపతులు ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. రీసెంట్‌గా తన రెండో ప్రెగ్నెన్సీని ఆమె సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తొలిసారి వారు బహిరంగంగా కనిపించడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

బేబీ బంప్‌తో దీపికా కనిపించారు. ఎయిర్ పోర్ట్ దగ్గర కారు దిగన దగ్గర నుంచీ మళ్లీ లోపలికి వెళ్లే వరకూ దీపిక వెంటే ఉంటూ ఆమెకు సపోర్ట్ ఇచ్చారు భర్త రణవీర్. కూల్, స్టైలిష్ లుక్‌లో ఈ జంట సందడి చేశారు. దీపికపై రణవీర్ కేరింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ హస్బండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

2018లో ఈ జంటకు వివాహం కాగా... 2024లో దువా జన్మించారు. ఈ నెల ప్రారంభంలో తమ జీవితంలోకి రెండో బిడ్డను ఆహ్వానిస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. తమ పెద్ద కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

Also Read : చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్‌ మూవీస్‌కు లీకుల షాక్ - ఐటమ్ సాంగ్ To యాక్షన్ సీక్వెన్స్!

తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించినా అంతకు ముందు సైన్ చేసిన భారీ సినిమాలను దీపికా కంప్లీట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ 'రాకా'లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండోసారి ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత ఈ మూవీ నుంచి ఆమె తప్పుకొంటున్నారంటూ ప్రచారం సాగింది. యాక్షన్ పార్ట్ రన్ టైం తగ్గిస్తున్నారంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. 

అయితే, అందులో ఎలాంటి నిజం లేదని రాకా టీం క్లారిటీ ఇచ్చింది. ఆమె రోల్ మూవీకే కీలకమని... యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ చేస్తారని స్పష్టం చేసింది. అలాగే, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ హీరోగా వస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్‌'లోనూ నటిస్తున్నారు. రీసెంట్‌గానే షారుఖ్‌తో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్ చేసేందుకు షూటింగ్ సెట్‌లో అడుగు పెట్టారట. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆమె యాక్షన్ సీన్స్ పార్ట్ కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అటు రణవీర్ కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీని తర్వాత జయ్ మెహతా దర్శకత్వంలో 'ప్రళయ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి జై మెహతా దర్శకత్వం వహిస్తుండగా... రణవీర్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hrudayam Murali OTT : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget