News
News
X

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

దసరా సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు. సినిమా క్రేజ్ ను ఊహించని నిర్మాత కోట్ల రూపాయలను కోల్పోయినట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

‘అంటే సుందరానికి’ సినిమాతో హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో ఒక విభిన్నమైన రస్టిక్ పాత్రలో కనిపించనున్నాడు నాని. ఇంతకుముందు ఎప్పుడు చూడనివిధంగా నాచురల్ స్టార్ లుక్ ఉండనుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. కీర్తి సురేష్ నాని సరసన నటించనుంది. అయితే ఈ సినిమా తెలంగాణ లోని గోదావరిఖని దగ్గర సింగరేణి బొగ్గు గని బ్యాక్ డ్రాప్ తో రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తి కరమైన వార్త నెట్టింట వైరల్ గా మారింది. 

‘దసరా’ ముందస్తు బిజినెస్ భారీగా జరుగుతుందని సమాచారం అందుతోంది. ఆంధ్రాలోని అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా అమ్ముడు పోయిందని, తెలంగాణలో కూడా భారీ మొత్తానికి ప్రముఖు నిర్మాత కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాకు పెట్టిన బడ్జెట్ కంటే థియేట్రికల్ బిజినెస్ ద్వారా వస్తున్న మొత్తం కాస్త ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. హీరో నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘దసరా’. ఈ సినిమా రూ. 65 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే నిర్మాత థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ బిజినెస్ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేసి సుమారు 10 కోట్ల లాభాలను ఆర్జించారని సమాచారం.

తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను నిర్మాత చాలా కాలం క్రితం 23 కోట్లకు కొనుగోలుదారుకు విక్రయించారు. అయితే వీరు రూ.28 కోట్లకు దిల్ రాజుకు విక్రయించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి 35 కోట్ల మధ్య భారీ ఆఫర్లు వస్తున్నాయట. నిర్మాత సినిమాను రూ.23 కోట్లకు అమ్మకుండా ఉంటే, అతను తెలుగు రాష్ట్రాల నుంచి ఈజీగా రూ.35 కోట్లు సంపాదించేవాడు.

‘దసరా’ సినిమాకు విపరీతమైన క్రేజ్ వస్తుందని ఆ సమయంలో నిర్మాత అనుకోలేదు. దీంతో ఈ సినిమాపై వచ్చే లాభాల గురించి నిర్మాత ఆలోచించకపోవడమే ఉత్తమం అని టాక్. సోమవారం విడుదలైన ‘దసరా’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్సాన్స్ రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ‘దసరా’ చిత్రంలో నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, షైన్ టామ్ చాకో, రాజశేఖర్ అనింగి నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Read Also: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?

అమెజాన్ చేతికి నాన్ థియేట్రికల్ రైట్స్?

‘దసరా’ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకుందని, ఇందుకు రూ.30 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం. ఇతర భాషలకు చెందిన రైట్స్‌కు మరో రూ.10 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రూ.20 కోట్లు వచ్చాయట. అంటే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.60 కోట్లు ఈ మూవీకి వచ్చేశాయ్. ఇక థియేటర్‌లో బొమ్మ పడి.. హిట్ టాక్ సొంతం చేసుకుంటే నిర్మాతకు నిజంగా ‘దసరా’ పండుగే. ఎందుకంటే.. ‘దసరా’ సినిమాకి రూ.40 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయట. అంటే మొత్తం కలుపుకొని రూ.100 కోట్లన్నమాట. మొత్తానికి థియేట్రికల్ రైట్స్‌లో నష్టం వచ్చినా.. ఓటీటీ డీల్ మాత్రం నిర్మాతకు ఊరటనిస్తున్నట్లే.

Published at : 02 Feb 2023 12:50 PM (IST) Tags: nani Dasara Movie Dasara Dasara bussiness Keerty Suresh

సంబంధిత కథనాలు

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Adivi Sesh On Education : అడివి శేష్‌ను భయపెట్టిన సబ్జెక్ట్ ఏదో తెలుసా?

Adivi Sesh On Education : అడివి శేష్‌ను భయపెట్టిన సబ్జెక్ట్ ఏదో తెలుసా?

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?