Renukaswamy Murder Case: జైల్‌లో హీరో దర్శన్‌కు అస్వస్థత - అసలు విషయం తెలిసి అంతా షాక్
Renukaswamy Murder: కర్నాటకలో సంచలనం సృష్టించిన కేసు.. రేణుకస్వామి హత్య. హీరో దర్శన్ ఈ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన జైలులో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
Darshan Fainted in Bengaluru Jail Due to Health Issues: కర్నాటకలో సంచలనం సృష్టించిన కేసు.. అభిమానికి హీరో దారుణంగా హత్య చేసిన కేసు. అదే రేణుకాస్వామి హత్య కేసు. హీరో దర్శన్ తన అభిమానిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే, దర్శన్ ఆరోగ్యంపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అసలు ఏమైందంటే?
జైల్ లో తీవ్ర అస్వస్థత..
అభిమానికి చంపిన కేసులో హీరో దర్శన్ ప్రస్తుతం బెంగళూరు పరప్పన్ అగ్రహార జైలులో కస్టడీలో ఉన్నాడు. అయితే, కస్టడీలో ఉన్న ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. అస్వస్థతకు గురైన దర్శన్ జైల్ లో కళ్లు తిరిగి పడిపోయినట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరో హెల్త్ కి సంబంధించి అప్ డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
దర్శన్ హెల్త్ పై క్లారిటీ..
దర్శన్ హెల్త్ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఆయన హెల్త్ బాగుందని, ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఫేక్ వార్తలు నమ్మొద్దని చెప్పారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆరోగ్యం బాలేదని ప్రచారం చేస్తున్న వార్తలపై ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. ఫేక్ వార్తలు ఎందుకు స్ప్రెడ్ చేస్తారని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వార్తలు వైరల్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ఫ్యాన్స్ ఎక్కువ..
కర్నాటక వ్యాప్తంగా హీరో దర్శన్ కి ఫ్యాన్స్ చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానిని చంపి జైలులో ఉన్నప్పటికీ ఆయనపై అభిమానులు మాత్రం హీరోకి సపోర్ట్ గానే ఉన్నారు. అందుకే, ఆయనకి హెల్త్ బాలేదని తెలిసిన వెంటనే ఆందోళనకు గురయ్యారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవాళ్లు ఒకటికి రెండుసార్లు తెలుసుకుని ప్రచారం చేయాలని దర్శన్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
14 వరకు రిమాండ్..
పవిత్ర గౌడ, దర్శన్ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేణుక స్వామి అనే ఒక అభిమాని పవిత్రకు అసభ్యంగా మెసేజ్ లు పెట్టిన కారణంగా.. పవిత్ర అతనిపై దర్శన్ కి చెప్పి చంపేందుకు ప్రేరేపించింది. దీంతో కోపం పెంచుకున్న దర్శన్ రేణుకస్వామిని పిలిపించి అతడిని టార్చర్ చేసి చంపేశారు. దీంతో ఈ కేసులో పవిత్ర గౌడ ప్రధాన నిందుతురాలు కాగా.. దర్శన్ ఏ2. రేణుక స్వామి కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. వాళ్లకు ఆగస్టు 14 వరకు కస్టడీ విధించింది కోర్టు. ఇక ఈ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దర్శన్ ఈ హత్య చేశాడనే విషయాన్ని నిరూపించేందుకు అవసరమైన కీలక సాక్ష్యాలను సేకరిస్తున్నారు పోలీసులు.
Also Read: అతిలోక సుందరి శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో జాన్వీ కపూర్ - అచ్చం అమ్మలాగే!