అన్వేషించండి

Danger Pilla Song : హారిస్ జయరాజ్ ఈజ్ బ్యాక్ - నితిన్, శ్రీ లీల 'ఎక్స్ట్రా'లో సూపర్ సాంగ్!

Extra 2023 Movie Songs : నితిన్, శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఇందులో ఫస్ట్ సాంగ్ 'డేంజర్ పిల్లా' విడుదల చేశారు.

నితిన్ (Nithiin) కథానాయకుడిగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఎక్స్ట్రా'. ఆర్డినరీ మ్యాన్... అనేది ఉపశీర్షిక (Extra Ordinary Man 2023 Movie). రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. 

హీరోగా నితిన్ 32వ చిత్రమిది. ఇందులో శ్రీ లీల (Sreeleela) కథానాయిక. వీళ్ళిద్దరి కలయికలో తొలి చిత్రమిది. వీళ్ళిద్దరిపై తెరకెక్కించిన 'డేంజర్ పిల్లా...' పాటను ఈ రోజు విడుదల చేశారు. 

''అరే బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా...
చీకట్లో తిరగని మిణుగురు తళుకువా...
ఒక్క ముల్లు కూడా లేనే లేని రోజు పువ్వా... 
రేరు పీసే నువ్వా!

కలలు కనదట...
కన్నెత్తి కనదట...
కరుకు మగువట... హొయ్!

నగలు బరువట...
గుణమే నిధి అట... 
ఎగిరి పడదట... హొయ్!

డేంజర్ పిల్లా... (2)
డేంజర్ పిల్లా పిల్లా ఏంజెల్ లాగా''   
అంటూ సాగిన ఈ గీతాన్ని కృష్ణకాంత్ (కేకే) రాశారు. అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సాంగ్ వింటుంటే వెంటనే ఎక్కేసే సూపర్ మెలోడీలా ఉంది. హారీస్ జయరాజ్ ఈజ్ బ్యాక్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనవచ్చు. 

హారీస్ జయరాజ్ తమిళ సంగీత దర్శకుడు అయినప్పటికీ... గతంలో తెలుగు చిత్రాలు కొన్నిటికి పని చేశారు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. కొంత విరామం తర్వాత ఆయన సంగీతం అందించిన తెలుగు చిత్రమిది. రీ ఎంట్రీలో తన మార్క్ చాలా స్పష్టంగా చూపించారు హారీస్ జయరాజ్.    
 
డిసెంబర్ 23న 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మ్యాన్'  
ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయడంతో పాటు 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మ్యాన్' విడుదల తేదీని కూడా నేడు  వెల్లడించారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు.  సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. ఈ సినిమాను మాత్రం శనివారం విడుదలవుతోంది. క్రిస్మస్ 25న కనుక కనుక సెలవులు ఉంటాయి. ఓపెనింగ్స్ విషయంలో ఢోకా అవసరం లేదు. 

Also Read : ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' - ఈసారి సంక్రాంతి మామూలుగా ఉండదు!

ఆల్రెడీ 60 శాతం సినిమా పూర్తి
'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తి అయ్యిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ప్ర‌స్తుతం చిత్రీక‌రణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందన్నారు. నితిన్ లుక్ చాలా కొత్త‌గా ఉందని అభిమానులు చెప్పడం సంతోషంగా ఉందని, ఫ్యాన్స్ లుక్ ఎక్సట్రాడినరీగా ఉందన్నారని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ ''ఎక్స్‌ట్రా' క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో... 'కిక్' త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రేక్షకులకు రోల‌ర్ కోస్ట‌ర్‌ లాంటి అనుభూతి ఇస్తుంది. న‌వ్విస్తూనే ట్విస్టులతో స‌ర్‌ప్రైజ్‌ చేస్తుంది'' అని చెప్పారు. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్.

Also Read మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget