Daaku Maharaaj: డాకు మహారాజ్ ఈవెంట్ కూడా అమెరికాలోనే... బాలకృష్ణ Dallas వెళ్ళేది ఎప్పుడంటే?
Daaku Maharaaj Event In USA: సంక్రాంతికి రాబోయే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సినిమా 'డాకు మహారాజ్' ఈవెంట్ అమెరికాలో చేయనున్నారు. అది ఎప్పుడు? అగ్ర రాజ్యానికి బాలకృష్ణ ఎప్పుడు వెళుతున్నారు? అంటే...
టాలీవుడ్ టాప్ స్టార్స్ కన్ను ఇప్పుడు అమెరికా మీద పడింది. మరీ ముఖ్యంగా సంక్రాంతికి తమ సినిమాలను తీసుకొస్తున్న అగ్ర నాయకులు తెలుగు రాష్ట్రాలు ఇండియాతో పాటు తమ సినిమాను అగ్రరాజ్యం అమెరికాలో కూడా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశారు. నట సింహం నందమూరి బాలకృష్ణ సైతం అమెరికా వెళుతున్నారు.
అమెరికాలో డాకు మహారాజ్ ఈవెంట్!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'డాకు మహారాజ్'. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు 8 రోజుల ముందు అమెరికాలో ఈవెంట్ ప్లాన్ చేశారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ సిటీలో జనవరి 4వ తేదీన దాకో మహారాజ్ ఈవెంట్ జరగనుంది. ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
'డాకు మహారాజ్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైర్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
𝐃𝐀𝐋𝐋𝐀𝐒 to become 𝐃𝐀𝐀𝐊𝐔 𝐙𝐎𝐍𝐄 🔥
— Sithara Entertainments (@SitharaEnts) November 23, 2024
Hello USA!!! Get ready to welcome the 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna garu, This 4th January at Dallas, Texas for the GRAND #DaakuMaharaajEvent 🇺🇸🤩⚡️
📍Dallas, Texas USA on 4th Jan @ 6PM Onwards! 💥
Teaser -… pic.twitter.com/y43GkCNsRm
బాలకృష్ణ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు!
'డాకు మహారాజ్' సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఆ ముగ్గురిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. 'అఖండ' విజయం తర్వాత నట సింహం బాలయ్యతో మరోసారి జంటగా ఆవిడ కనువిందు చేయనున్న సినిమా ఇది. మరొక కథానాయికగా నాని 'జెర్సీ', వెంకటేష్ 'సైంధవ్', విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమాల ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండగా... బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల స్పెషల్ సాంగ్ చేసినట్టు తెలిసింది. తెలుగు అమ్మాయి యువ కథానాయిక చాందిని చౌదరి కథలో కీలకమైన క్యారెక్టర్ చేస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబి డియోల్ విలన్ రోల్ చేస్తుండగా... మకరంద్ దేశ్ పాండే మరో కీలకమైన పాత్ర చేస్తున్నారు.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే షోస్ క్యాన్సిల్, కలెక్షన్స్ అయితే మరీ ఘోరం
విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనవరి 14న థియేటర్లలోకి వస్తుండగా... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఈ మూడు సినిమాలకు తోడు తమిళం నుంచి అజిత్ హీరోగా నటించిన 'గుడ్ బాడ్ అగ్'లీ సైతం సంక్రాంతి బరిలో విడుదల కానుంది.
Also Read: రేవంత్ రెడ్డి పాలనలో కేసీఆర్‌ను పొగిడితే ఎలా... రాంగ్ స్టెప్ వేసిన 'జబర్దస్త్' రాకేష్