Cricketer Sreesanth: సీఎం మనవడు సీఎం కావడం తప్పా? - తెలుగులో క్రికెటర్ శ్రీశాంత్ కన్నడ సినిమా!
క్రికెటర్ శ్రీశాంత్ నటుడిగా కొన్ని సినిమాలు చేశారు. అందులో కన్నడ సినిమా 'కెంపె గౌడ 2' ఒకటి. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేశారు.
Yamadheera Movie: క్రికెటర్ శ్రీశాంత్ కెరీర్‌లో కాంట్రవర్సీలు ఎక్కువ. క్రికెట్ ప్రేమికులతో పాటు సాధారణ ప్రజలకు సైతం ఆయన గురించి తెలిసేలా చేసింది ఆ వివాదాలే. మైదానంలో తన ఆటతో ఆకట్టుకున్న ఆయన... మూవీల్లోనూ యాక్ట్ చేశారు. శ్రీశాంత్ నటించిన సినిమాల్లో 'కెంపె గౌడ 2' ఒకటి. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో 'యమధీర'గా డబ్బింగ్ చేస్తున్నారు.
'యమధీర' టీజర్ విడుదల చేసిన అశోక్ కుమార్!
'యమధీర' సినిమాలో కన్నడ నటుడు కోమల్ కుమార్ హీరో. ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ చేశారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ పతాకంపై వేదాల శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. 'యమధీర' సినిమాలో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ వంటి తెలుగు నటుడు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నటులు, నిర్మాత అశోక్ కుమార్ చేతుల మీదుగా 'యమధీర' టీజర్ విడుదలైంది.
సీఎం కొడుకు సీఎం కావడం తప్పా?
Yamadheera Movie Teaser Review: 'మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ కొడుకు సీఎం కావడం తప్పా? తప్పా? - 'యమధీర' టీజర్ మొదలైన తర్వాత వినిపించే తొలి మాట. ఆ తర్వాత విలన్ రోల్ చేసిన శ్రీశాంత్ కనిపించారు. ఆయన సీయం మనవడిగా కనిపించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత నాగబాబు, హీరో కోమల్ కుమార్ పోలీస్ క్యారెక్టర్లలో కనిపించారు. ఏపీలో ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. టీజర్ డైలాగ్స్ రాజకీయాల్లో చర్చకు కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్వరలో ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తాం!
నిర్మాతగా తనకు 'యమధీర' తొలి సినిమా అని వేదాల శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''సినిమాలపై ప్రేమతో శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలు పెట్టాను. ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా. మా సినిమా టీజర్ లాంచ్ చేసిన అశోక్ కుమార్ గారికి థాంక్స్. ఆయన నాకు ఎన్నో ఏళ్లుగా స్నేహితుడు. త్వరలోనే 'యమధీర'ను థియేటర్లలో విడుదల చేస్తాం'' అని చెప్పారు.
Also Read: తంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?
అశోక్ కుమార్ మాట్లాడుతూ... ''నా స్నేహితుడు వేదాల శ్రీనివాస్ కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. నిర్మాతగా ఆయన తొలి సినిమా 'యమధీర' మంచి విజయం సాధించి... శ్రీ మందిరం సంస్థలో మరిన్ని సినిమాలు రావాలి. కన్నడలో 90కు పైగా సినిమాల్లో నటించిన కోమల్ కుమార్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేశారు. ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మైదానంలో చూపించిన దూకుడు ప్రతినాయకుడిగా మంచి నటన కనబరిచారని విన్నాను. అజర్ బైజాన్, శ్రీలంక దేశాలతో పాటు మైసూర్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు'' అని చెప్పారు.
Also Read: రజాకార్ రివ్యూ: మారణహోమం సృష్టించిన మతోన్మాదం - తెలంగాణ చరిత్రను ఎలా తీశారంటే?
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రోష్ మోహన్ కార్తీక్, మాటలు & పాటలు: వరదరాజ్ చిక్కబళ్ళపుర, కూర్పు: సి రవిచంద్రన్, సంగీతం: వరుణ్ ఉన్ని, కథ & దర్శకత్వం: శంకర్ ఆర్.