Coolie Box Office Collection Day 6: కిందకు పడిన కూలీ... మంగళవారం కలెక్షన్ 10 కోట్ల లోపే - ఇక నుంచి ఇంతేనా?
Coolie Day 6 Collection: సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ'కి సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు. మంగళవారం ఇండియన్ థియేటర్స్ దగ్గర ఆ మూవీ కలెక్షన్స్ దగ్గర దగ్గర పది కోట్లు.

Coolie Worldwide Box Office Collection Till Now: సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాడ్ డేస్, టఫ్ రైడ్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఇండియన్ థియేటర్స్ దగ్గర మంగళవారం నుంచి సినిమాకు వచ్చే జనాలు బాగా తగ్గారు. మూవీ కలెక్షన్స్ పది కోట్లకు పడింది. థియేటర్లలో విడుదలైన ఆరో రోజు ఈ మూవీ కలెక్షన్ ఎంత? అనేది చూస్తే...
ఇండియాలో 'కూలీ'లో తగ్గిన ఆదరణ
Coolie Day 6 Collection India: ట్రేడ్ పోర్టల్స్ ఎర్లీ ఎస్టిమేషన్ ప్రకారం... 'కూలీ'కి ఇండియాలో మంగళవారం పది కోట్లకు అటు ఇటుగా వసూళ్లు వచ్చాయి. రూ. 9.50 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ టాక్. కంప్లీట్ లెక్కలు తీస్తే ఓ 50 లక్షలు పెరిగినా రూ. 10 కోట్ల దగ్గర ఆగుతుంది.
వీకెండ్ తర్వాత 'కూలీ' కలెక్షన్స్ కూడా డ్రాప్ అయ్యాయి. అయితే సోమవారం ఈ సినిమా 12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో పర్వాలేదని ఫ్యాన్స్ & ఆడియన్స్ భావించారు. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మంగళవారం మరింత తగ్గింది. బుధ, గురువారాల్లో సైతం సేమ్ సిట్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కనుక వాటి రిజల్ట్ బట్టి 'కూలీ' కలెక్షన్స్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ బరిలో ఇప్పటి వరకు 'కూలీ' సినిమా రాబట్టిన నెట్ కలెక్షన్స్ అమౌంట్ రూ. 216 కోట్లు. ఒక విధంగా ఇది మంచి అమౌంట్. అయితే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే ఇంకా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
వరల్డ్ వైడ్ 'కూలీ' కలెక్షన్స్ ఎంత?
Coolie Worldwide Collection Till Now: తెలుగు రాష్ట్రాల్లో 'కూలీ' కలెక్షన్లు చూస్తే ఐదు రోజుల్లో రూ. 57 కోట్ల గ్రాస్ (రూ. 38 కోట్ల షేర్) కలెక్ట్ చేసింది. మరో 9 కోట్ల షేర్ వస్తే తెలుగులో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే... ఐదు రోజుల్లో రూ. 406 కోట్ల గ్రాస్ (రూ. 204.75 షేర్) రాబట్టింది. మరొ 100 కోట్ల షేర్ వస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయ్యే ఛాన్సులు లేవు. ప్రజెంట్ కలెక్షన్స్ చూస్తే అంత రావడం కష్టంగా ఉంది. ఎందుకంటే సినిమాను 300 కోట్లకు అమ్మారు. దానికి డబుల్... అంటే రూ. 600 కోట్ల గ్రాస్ వస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కలేరు.





















