Hari Hara Veera Mallu OTT: ఓటీటీలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు'... పవన్ సినిమాకు ప్రైమ్ వీడియో సపరేట్ సెన్సార్... ఇదెక్కడి ట్విస్ట్?
Hari Hara Veera Mallu OTT Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా 'హరిహర వీరమల్లు' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. అయితే ఒక ట్విస్ట్ ఇచ్చింది ఓటీటీ సంస్థ.

Pawan Kalyan's Hari Hara Veera Mallu OTT Release Date: థియేటర్లలో విడుదల అయిన నెల రోజుల లోపే ఓటీటీలో సందడి చేయడానికి 'హరి హర వీరమల్లు' రెడీ అయ్యింది. ఈ వారమే సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కు ట్విస్ట్ ఇచ్చింది.
ఆగస్టు 20వ తేదీ నుంచి వీరమల్లు స్ట్రీమింగ్
HHVM OTT Streaming Date: జూలై 24న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'హరి హర వీరమల్లు' విడుదలైంది. ఆగస్టు 24 వరకు కూడా కాదు... ఆగస్టు 20వ తేదీ నుంచి తమ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు స్పష్టం చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో.
థియేటర్లలో సినిమా ఐదు భాషల్లో విడుదలైనప్పటికీ... ఓటీటీలోకి మాత్రం ప్రస్తుతానికి మూడు భాషల్లో మాత్రమే వస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. హిందీ వెర్షన్ మరో నెల తర్వాత వచ్చే ఛాన్స్ ఉంది.
వీరమల్లు ఓటీటీకి సపరేట్ సెన్సార్ చేశారా?
'హరి హర వీరమల్లు' ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్ జాగ్రత్తగా గమనిస్తే... ఓటీటీ కోసం సపరేట్ సెన్సార్ చేశారా? అనే సందేహాలు కలుగుతాయి. ఎందుకు అంటే... ఈ సినిమాకు ఫిల్మ్ సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీ పోస్టర్ చూస్తే... కుడివైపు కింద 'ఏ' అని చిన్న అక్షరాలతో కనపడుతుంది. ఇదెక్కడి ట్విస్ట్ మావా? అని ఫ్యాన్స్ & ఆడియన్స్ అవాక్కు అవుతున్నారు. ఓటీటీలో ఇంటిల్లిపాది సినిమాలు చూస్తారు. 'హరి హర వీరమల్లు'లో హద్దులు మీరి హీరోయిన్లు అందాల ప్రదర్శన చేసిన సన్నివేశాలు లేవు. రక్తపాతం లేదు. మరి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 'ఏ' సర్టిఫికెట్ ఎందుకు పోస్టర్ మీద వేసిందో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు'కు క్రిష్ జాగర్లమూడి, నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం మీద రత్నం సోదరుడు దయాకర్ రావు ప్రొడ్యూస్ చేశారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా... బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. ఔరంగజేబు పాత్రలో ఆయన సందడి చేశారు. ఇతర పాత్రల్లో నాజర్, సునీల్, రఘుబాబు, సత్యరాజ్, దిలీప్ తాహిల్, సచిన్ ఖేడేకర్, సుబ్బరాజు, కబీర్ బేడీ, కబీర్ దుహన్ సింగ్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు తదితరులు నటించారు. ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Also Read: జపాన్‌లో 'సింహాద్రి' రిలీజ్... పబ్లిసిటీలో 'ఆర్ఆర్ఆర్'ను గుర్తు చేస్తూ... ఎప్పుడో తెలుసా?





















