Pushpa 2 : 'పుష్ప 2' పాటకు పూనకాలు వస్తే ఇట్టా ఉంటాది... 'పీలింగ్స్' సాంగ్కు ఇరగదీసే స్టెప్పులేసిన లేడీ ప్రొఫెసర్
Pushpa 2 : 'పుష్ప 2' పాటకు పూనకాలు వస్తే ఇట్టా ఉంటాది అన్పించేలా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో 'పీలింగ్స్' సాంగ్ కు లేడీ ప్రొఫెసర్ ఇరగదీసే స్టెప్పులేసింది.
Peelings Song : 'పుష్ప 2' మేనియా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 20 రోజులు పూర్తయినా ఇంకా సందడి తగ్గలేదు. ఓవైపు కలెక్షన్ల పరంగా వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తూ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు పుష్ప రాజ్. మరోవైపు 'పుష్ప 2' మేనియా ఏ రేంజ్ లో ఉందో, ఈ సినిమా పాటల వైబ్ ఎలా పూనకాలు తెప్పిస్తోందో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏకంగా ఓ యూనివర్సిటీకి చెందిన లేడీ ప్రొఫెసర్ 'పుష్ప 2' పాటకు ఇరగదీసే స్టెప్పులు వేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.
'పుష్ప 2' సాంగ్ కు లేడీ ప్రొఫెసర్ డాన్స్
కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మైక్రో బయాలజీ విభాగంలో హెచ్ఓడి అయిన పార్వతీ వేణు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు. తమ కాలేజీకి సంబంధించిన ఓ ఈవెంట్లో ఈ లేడీ ప్రొఫెసర్ తన ఎనర్జిటిక్ డాన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముదురు ఆకుపచ్చ రంగు చీర ధరించి, ఆమె 'పుష్ప 2'లోని 'పీలింగ్స్' సాంగ్ కు డాన్స్ చేసిన విధానం అక్కడ విద్యార్థులతో పాటు అందరినీ అబ్బురపరిచింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ఈ లేడి ప్రొఫెసర్ 'ఫీలింగ్స్' పాటకు రష్మిక రేంజ్ లో స్టెప్పులు వేసింది.
నిజానికి ఈ వీడియోని చూస్తుంటే 'ఘర్షణ' మూవీలో అసిన్ గుర్తొస్తుంది. తన స్టూడెంట్స్ తో ఆమె ఎలా ఉంటుందో చూసినప్పుడల్లా, రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి టీచర్ కావాలని ప్రతి ఒక్కరూ అనుకొనే ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ రీల్ ను చూసాక కొచ్చిన్ యూనివర్సిటీ విద్యార్థులు అదృష్టవంతులు అనిపించకమానదు. అందుకేనేమో చాలామంది ఈ వీడియోని చూసి "కూల్ హెచ్ఓడీ", "ఇలాంటి మేడం మాకూ కావాలి" అంటూ కామెంట్స్ బాక్స్ ని నింపేస్తున్నారు.
View this post on Instagram
హిందీలో ర్యాంప్ ఆడిస్తున్న 'పుష్ప 2'
ఇదిలా ఉండగా తెలుగులో కంటే హిందీలో 'పుష్ప 2' కలెక్షన్ల ఊచకోత కోస్తోంది. ఈ వారం క్రిస్మస్ కానుకగా పలు సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ పుష్ప గాడి జోరు ఏ మాత్రం తగ్గలేదు. హిందీలో అయితే కొత్తగా రిలీజ్ అయిన 'బేబీ జాన్' ఫస్ట్ డే కలెక్షన్లను దాటేసి, మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు పుష్పరాజ్. ఇక మరోవైపు టాలీవుడ్ లో 'పుష్ప 2' కలెక్షన్ల కంటే ఆ సినిమా టైంలో జరిగిన వివాదమే ఎక్కువగా నడుస్తోంది. ఈరోజు పలువురు టాలీవుడ్ సినీ పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ వివాదం గురించి చర్చిస్తున్నారు. ఆ చర్చల ఫలితం ఏంటి అన్న విషయాన్ని మీటింగ్ ముగిసిన తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రెస్ మీట్ లో వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి సినీ ఇండస్ట్రీ - ముఖ్యమంత్రి భేటీకి పైనే ఉంది.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?