News
News
X

Cobra Movie Twitter Review - 'కోబ్రా' ఆడియన్స్ రివ్యూ : విక్రమ్ కెరీర్‌లో బెస్ట్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్యాంగ్ సూపరో సూపర్ - సినిమా ఎలా ఉందంటే?

విక్రమ్ 'కోబ్రా' నేడు థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్ మార్కెట్స్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఎర్లీ మార్నింగ్ షోలు వేశారు. ఆడియన్స్ సినిమా గురించి ఏం చెబుతున్నారంటే...

FOLLOW US: 

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా... 'అపరిచితుడు' నుంచి తాజా 'కోబ్రా' వరకూ ఆయన సినిమా వస్తుందంటే చాలు, తెలుగునాట ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. తెలుగులో మాత్రమే కాదు, తమిళనాడులో ప్రేక్షకులు కూడా ఒక విధమైన ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు.

వెండితెరపై తాను కాకుండా పాత్ర మాత్రమే కనిపించేందుకు కృషి చేయడం కోసం విక్రమ్ ఎంత కష్టమైనా పడతారు. విభిన్నమైన గెటప్‌లు వేస్తుంటారు. సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ తీసిన 'అపరిచితుడు', 'ఐ మనోహరుడు' నుంచి ఇప్పటి వరకూ ఎన్నో గెటప్‌ల‌లో విక్రమ్ కనిపించారు. ఇప్పుడు 'కోబ్రా' (Cobra Movie) సినిమాలో మరోసారి డిఫరెంట్ గెటప్‌లు వేశారు.

తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు (ఆగస్టు 31న) 'కోబ్రా' భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇందులో విక్రమ్ సరసన 'కెజియఫ్ 2' ఫేమ్ శ్రీనిధి శెట్టి (KGF 2 Heroine Srinidhi Shetty) నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ఆల్రెడీ అమెరికాలో, ఇండియాలోని కొన్ని ఏరియాల్లో షోలు పడ్డాయి. అవి చూసిన ప్రేక్షకులు ఏమన్నారు?

'కోబ్రా'లో విక్రమ్ గెటప్‌లు ఎలా ఉన్నాయి? సినిమాలో శ్రీనిధి శెట్టి ఎలా ఉన్నారు? 'డీమాంటే కాలనీ', నయనతార 'అంజలి సీబీఐ ఆఫీసర్' (తమిళంలో 'ఇమైక నొడిగల్') విజయాల తర్వాత 'కోబ్రా'తో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు హ్యాట్రిక్ అందుకున్నారా? ట్విట్టర్‌లో ఆడియన్స్ ఏం అంటున్నారో చూడండి.
 
'కోబ్రా' సినిమాకు ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ దుబాయ్ నుంచి వచ్చింది. ఉమైర్ సంధు ఈ సినిమాకు త్రీ అండ్ హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. విక్రమ్ నటనకు నేషనల్ అవార్డు గ్యారెంటీ అని చెప్పారు. స్ట‌యిలిష్‌గా, ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉందని పేర్కొన్నారు.

విక్రమ్ కెరీర్‌లోనే 'కోబ్రా' సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ బెస్ట్ అని ఆడియన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉమైర్ సంధు చెప్పినట్లు... విక్రమ్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని కొంత మంది అభిమానులు పేర్కొన్నారు. మెజారిటీ ప్రేక్షకులు చెప్పేది అయితే 'కోబ్రా' ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని! ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో ఇచ్చిన ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. 

ట్విట్టర్‌లో మెజారిటీ నెటిజన్స్ నుంచి 'కోబ్రా'కు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఎట్ ద సేమ్ టైమ్... కొంత మంది నెగిటివ్ రివ్యూలు కూడా ఇస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు ఊహించామని విక్రమ్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అయితే, సినిమా నిడివి కాస్త ఎక్కువ అయ్యిందని కొందరు చెబుతున్నారు.  మొత్తం మీద మూడేళ్ళ తర్వాత థియేటర్లలోకి వచ్చిన విక్రమ్‌కు గ్రాండ్ వెల్కమ్ లభించేలా ఉంది. 

Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు

చెన్నైలో ఈ రోజు విక్రమ్, ఆయన కుమారుడు ధృవ్ విక్రమ్ ఎర్లీ మార్నింగ్ షో చూడటానికి వెళ్ళారు. థియేటర్లలో వాళ్ళిద్దరికీ అభిమానులు ఈలలు, చప్పట్లతో స్వాగతం పలికారు. 

Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ

Published at : 31 Aug 2022 07:30 AM (IST) Tags: Vikram Cobra Movie KGF 2 Heroine Srinidhi Shetty Cobra Movie Twitter Review Cobra Movie Twitter Response

సంబంధిత కథనాలు

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Allari Naresh: అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Allari Naresh: అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’  రిలీజ్ డేట్ ఫిక్స్!

Nene Vasthunna Review - 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Nene Vasthunna Review - 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Godfather Pre Release: వర్షంలోనూ సాగిన చిరు స్పీచ్, అభిమానులే గాడ్ ఫాదర్స్ అంటూ ఉద్వేగం, గ్రాండ్ గా ప్రీరిలీజ్

Godfather Pre Release: వర్షంలోనూ సాగిన చిరు స్పీచ్, అభిమానులే గాడ్ ఫాదర్స్ అంటూ ఉద్వేగం, గ్రాండ్ గా ప్రీరిలీజ్

టాప్ స్టోరీస్

TRS MP Santosh Issue : ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ - అసలేం జరిగిందంటే ?

TRS MP Santosh Issue :  ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ -  అసలేం జరిగిందంటే ?

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Eatala Rajender: మంత్రుల మాటలు కేసీఆర్ కేర్ చెయ్యలేదు, అందుకే ఈ సమస్యలు - ఈటల రాజేందర్

Eatala Rajender: మంత్రుల మాటలు కేసీఆర్ కేర్ చెయ్యలేదు, అందుకే ఈ సమస్యలు - ఈటల రాజేందర్

Apple Event: యాపిల్ కొత్త ఈవెంట్‌ త్వరలో - ఈసారి ల్యాప్‌టాప్‌లు!

Apple Event: యాపిల్ కొత్త ఈవెంట్‌ త్వరలో - ఈసారి ల్యాప్‌టాప్‌లు!