Bharateeyudu -2: భారతీయుడు -2 సినిమా బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Govt: డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సినిమా పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. డ్రగ్స్ వాడొద్దని చెబుతూ భారతీయుడు -2 యూనిట్ వీడియో రిలీజ్ చేసింది.
Revanth Reddy Appreciate Bharatiyadudu-2 Team: తెలంగాణ ప్రభుత్వం సూచించినట్టుగానే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారతీయుడు-2 సినిమా టీం విడుదల చేసింది. మంచి భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు డ్రగ్స్‌కు దూరంగా ఉందామంటూ వీడియో క్రియేట్ చేశారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడయాలో పోస్టు చేశారు. ఇలాంటి రుగ్మతలపై పోరాడేందుకు ముందుకు వచ్చిన సినిమా బృందానికి రేవంత్ ధన్యవాదాలు చెప్పారు.
వీడియోలో ఏం ఉందంటే...
మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. ప్లే సే నో డ్రగ్స్ అని హీరో కమల్ హాసన్ రిక్వస్ట్‌తో మొదలవుతుంది వీడియో.. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వీడియోలను తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని కమల్ అభినందించారు.
మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. డ్రగ్స్ వద్దని చెప్పండని సిద్ధార్థ్ రిక్వస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని దర్శకుడు శంకర్, నటుడు సముద్రఖనితో కూడా చెప్పించారు.
భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.
— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024
డ్రగ్స్ రహిత సమాజం కోసం…
ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…
శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…
శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…
రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze