News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

మెగాస్టార్ టూ సూపర్ స్టార్, గుండుతో దర్శనమిచ్చిన హీరోలు వేరే!

సినిమాల్లో ఎప్పుడూ నిండైన జుట్టుతో కనిపించే హీరోలు.. క్యారెక్టర్ డిమాండ్ మేరకు అప్పుడప్పుడు గుండుతో కనిపించిన సందర్భాలు ఉన్నాయి. గుండు బాస్ లుగా మారిన ఆ హీరోలు ఎవరంటే...

FOLLOW US: 
Share:

సినీ అభిమానులను అలరించడానికి హీరోలు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను అందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారిలో కొందరు సినిమా కోసం ఎలాంటి సాహసాలు చేయడానికైనా రెడీగా ఉంటారు. కథ డిమాండ్ చేస్తే గుండుతో కనిపించడానికి కూడా వెనకాడరు. ఇప్పుడు లేటెస్టుగా 'జవాన్' చిత్రంలో షారుఖ్ ఖాన్ గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ గుండు బాసులుగా దర్శనమిచ్చిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం!

రజినీకాంత్:
సూపర్ స్టార్ రజనీకాంత్ 'శివాజీ' సినిమాలో గుండుతో కనిపించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కథ ప్రకారం శివాజీగా మరణించినట్లు డ్రామా చేసిన రజినీ.. ఎన్టీ రామారావు అనే ఎన్నారైగా సరికొత్త లుక్ తో తిరిగొస్తారు. ఈ సందర్భంగా 'బాస్.. గుండు బాస్' అంటూ ఆయన శైలి మ్యానరిజంతో చెప్పే డైలాగ్ ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా క్లైమాక్స్ లోనూ గుండు గెటప్ లోనే ఫైట్ చేసి అలరించారు.

కమల్ హాసన్:
ఎలాంటి పాత్ర అయినా అందులో పరకాయప్రవేశం చేసే యూనివర్సల్ స్టార్ కమల్ హసన్.. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు. ఈ క్రమంలో 'అభయ్' మూవీలో గుండుతో కనిపించి ఆశ్యర్యపరిచారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయగా.. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కోసం గుండు చేయించుకున్నారు. సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కు కమల్ స్వయంగా కథ - స్క్రీన్ ప్లే అందించారు.

మోహన్ బాబు:
570కి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో అలరించిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. ‘శివ శంకర్’ అనే సినిమాలో గుండుతో కనిపించారు. కథానుగుణంగా బౌద్ధ భిక్షువు పాత్ర కోసం గుండు చేయించుకున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. అలనాటి నటి సౌందర్యకు తెలుగులో చివరి సినిమా ఇదే. ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాకముందే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

విక్రమ్ - రాజశేఖర్ - సల్మాన్ ఖాన్:
వర్సటైల్ యాక్టర్ విక్రమ్ 'సేతు' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండు చేయించుకున్నారు. బాలా తెరకెక్కించిన ఈ చిత్రం పలు భాషల్లో రీమేక్ చేయబడింది. తెలుగు రీమేక్ ‘శేషు’ కోసం యాంగ్రీమ్యాన్ రాజశేఖర్, హిందీ రీమేక్ 'తేరే నామ్' కోసం సల్మాన్ ఖాన్ కూడా గుండుతో దర్శనమిచ్చారు.

సూర్య & అమీర్ ఖాన్:
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘గజనీ’ సినిమాలో గుండుతో కనిపించారు. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పేషెంట్ పాత్ర కోసం ఆయన గుండు చేయించుకున్నారు. తల మీద గాటుతో ఉండే ఈ గజినీ హెయిర్ కట్ అప్పట్లో చాలా ఫేమస్ అయింది. మురగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీన్ని హిందీలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో రీమేకే చేశారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ కూడా తన పాత్ర కోసం గుండు బాస్ గా మారాడు.

కార్తీ:
అన్న సూర్య బాటలో తమ్ముడు కార్తి కూడా గుండు లుక్ లో కనిపించారు. గోకుల్ డైరెక్ట్ చేసిన ‘కాశ్మోరా’ అనే హారర్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో గుండుతో భయపెట్టాడు కార్తీ.

గోపీచంద్:
యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ పాత్ర కోసం నెత్తి మీద ఒక పిలకతో గుండు లుక్ లో కనిపించారు. తేజ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నిజం’ సినిమాలో గోపీ గుండుతో దర్శనమిచ్చారు.
 

షారుక్ ఖాన్:
తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా కోసం గుండు బాస్ గా మారాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కింగ్ ఖాన్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ లో గుండు గెటప్ లో షారుక్ వేసిన స్టెప్పులు నవ్వు తెప్పించాయి.

చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ఎవరూ ఊహించని విధంగా Urban Monk అంటూ గుండు ఫోటోని షేర్ చేశారు. 'గుండు బాస్' గా మారిన బిగ్ బాస్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. మెహర్ రమేష్ 'భోళా శంకర్' సినిమా కోసం లుక్ టెస్ట్ లో భాగంగా చిరు ఈ సర్ప్రైజ్ ఇచ్చారని అప్పట్లో టాక్ నడిచింది. మరి మూవీలో మెగా బాస్ గుండుతో కనిపిస్తారో లేదో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

రియల్ లైఫ్ లో గుండు బాస్ లు:
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన బాలకృష్ణ 'అఖండ' సినిమాలో అఘోర పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ విగ్ లేకుండా కనిపించారు. ఆ టైంలో బాలయ్య గుండుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయాయ్యి. 'శిరిడి సాయి' సినిమా తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున గుండుతో దర్శనమిచ్చారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేయడానికి ముందు రామ్ పోతినేని గుండు చేయించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గుండుతో ఉన్న ఫోటోలు ఇప్పటికీ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.

Also Read: తమిళ దర్శకుడితో నాని సినిమా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Jul 2023 07:05 AM (IST) Tags: Karthi Rajinikanth Shah Rukh Khan Suriya Kamal Haasan Jawan Vikram Chiranjeevi Bald Head Heroes gajini Gundu Boss heroes with bald head

ఇవి కూడా చూడండి

Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

టాప్ స్టోరీస్

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో